Asianet News TeluguAsianet News Telugu

మహ్మద్ షమీ మాజీ భార్యకు పోలీసు భద్రత... ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్...

రామమందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా హిందువులకు శుభాకాంక్షలు తెలిపిన హసీన్ జహాన్...

 చాలాసార్లు బెదిరింపు కాల్స్ ఎదుర్కొన్నానని, తనకూ, తన బిడ్డకూ ప్రాణహాని ఉందని కోర్టుని ఆశ్రయించిన షమీ భార్య...

security arrangement for Mohammad Shami wife hasin jahan for those comments CRA
Author
India, First Published Sep 30, 2020, 6:30 PM IST

IPL 2020 సీజన్ 13లో అద్భుతంగా రాణిస్తున్నాడు భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ. భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న వేళ, షమీ మాత్రం బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. షమీ భార్య హాసీన్ జహాన్‌ అనేక వివాదాస్పద కామెంట్లతో కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజున... హిందువులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు చేసింది హసీన్ జహాన్. అంతేకాకుండా ఇస్లాం మత సంప్రదాయాలకు విరుద్ధంగా పవిత్ర దినాల్లో పొట్టి పొట్టి దుస్తులు వేసుకున్న ఫోటోలు పోస్టు చేసింది హాసీన్. అందుకే చాలామంది మతచాంధసవాదులు జహాన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

ఇప్పటికే చాలాసార్లు బెదిరింపు కాల్స్ ఎదుర్కొన్నానని, తనకూ, తన బిడ్డకూ ప్రాణహాని ఉందని కోర్టుని ఆశ్రయించింది హాసీన్ జహాన్. జహాన్ పిటిషన్‌ను స్వీకరించి, విచారణ చేసిన న్యాయస్థానం, ఆమె భయం నిజమేనని తేల్చింది. జహాన్‌కు ఆమె ఇంటికి భద్రత కలిగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. 

షమీపై, అతని కుటుంబంపై గృహ హింస ఆరోపణలు చేసిన హాసీన్ జహన్, ఈ భారత పేసర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే విచారణ అనంతరం ఈ ఆరోపణలుల్లో నిజం లేదని తేల్చారు బీసీసీఐ అధికారులు. 

Follow Us:
Download App:
  • android
  • ios