క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ స్కూటర్ స్టేడియంలోకి వచ్చింది. ఏకంగా పిచ్‌పైకి ఆ డ్రైవర్ తోలుకు వచ్చాడు. నింపాదిగా పిచ్‌పై నుంచి ఆ స్కూటర్‌ను నడుపుకుని తిరిగి వెనక్కి వెళ్లాడు. పిచ్ పైకి స్కూటర్ రావడంతో ప్లేయర్లు షాక్ అయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ: క్రికెట్‌కు ప్రపంపవ్యాప్త అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మన ఇండియాలో క్రికెట్ అంటే మరో ప్రపంచంగా ఆదరిస్తున్నవారు ఉన్నారు. ఒకసారి క్రికెట్ వైపు మళ్లామంటే.. ప్రతి మ్యాచ్ ఏదో కొత్త ఉత్సాహాన్ని, హుషారును నింపుతూనే ఉంటుంది. కానీ, తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం హుషారుతోపాటు ఓ షాక్‌ను కూడా ఇచ్చింది. ఔను.. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ స్కూటర్ స్టేడియంలోకి దూసుకొచ్చింది. అంతేకాదు, స్టేడియం నడిబొడ్డు పిచ్‌పైకీ వచ్చింది. బౌలర్, బ్యాట్స్‌మెన్, అంపైర్ బిత్తర చూపులు చూడటానికే పరిమితం అయ్యారు. ఆ స్కూటర్ మాత్రం నింపాదిగా అసలు అక్కడ ఏమీ జరగనట్టు పిచ్‌పై ముందుకు వెళ్లింది. ఆ తర్వాత అదే పక్కకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఆ వీడియోలో స్కూటర్ కనిపించగానే కామెంటేటర్ కూడా ఖంగుతిన్నాట్టు స్పష్టం అవుతున్నది. ఆయన ఆ గందరగోళాన్ని అదిమిపెట్టలేకపోయాడు. ఆ కామెంట్రీ ఉచ్చస్థితిలోకి వెళ్లింది.
ఈ వీడియో క్లబ్ లెవెల్ గేమ్ అని తెలుస్తున్నది. అయితే, ఇలాంటి ఘటనలు కేవలం క్లబ్ లెవెల్ గేమ్స్‌కే కాదు. హైయర్ ఫామ్స్ మ్యాచ్‌లలోనూ ఇలాంటి వింత ఘటనలు చోటుచేసుకున్నాయి. భారత్‌లో రెండు రాష్ట్రాల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుండగా స్కూటర్ కాదు కదా.. ఏకంగా కారు వచ్చింది.
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల మధ్య ఢిల్లీలోని పాలమ్‌లో ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రంజీ మ్యాచ్ జరుగుతుండగా ఓ వ్యక్తి తన కారును స్టేడియంలోకి తెచ్చాడు. ఆ కారు పిచ్‌పైకి వచ్చి ఆగింది. ఈ రంజీ మ్యాచ్‌లో అంతర్జాతీయ ప్లేయర్లూ ఉండటం గమనార్హం. గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మలు ఢిల్లీ వైపు ఆడుతుండగా, ఉత్తరప్రదేశ్ వైపు సురేష్ రైనాలు ఆడారు.
