సర్ఫరాజ్ ఖాన్ దిమ్మతిరిగే బ్యాటింగ్ గణాంకాలు.. ! భారత్-ఇంగ్లాండ్ టెస్టులో అదరగొడతాడా?
IND vs ENG - Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ లో ఇప్పటివరకు 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. 301 పరుగులు వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్. ఇప్పుడు టీమిండియా తరఫున ఆరంగేట్రం చేయబోతున్నాడు.
India vs England - Sarfaraz Khan: చాలా కాలం నుంచి ఉన్న నిరీక్షణకు తెరపడనుంది. దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు తన టెస్టు అరంగేట్రం కోసం సిద్ధమయ్యాడు. ఇంగ్లాండ్ తో భారత్ మూడో టెస్టులో దాదాపు అతని ఎంట్రీ ఖాయమైనట్టుగా కనిపిస్తోంది. ఈ ముంబై బ్యాటర్ చాలా కాలంగా టీమిండియా తరఫున ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో ఛాన్స్ వచ్చే అవకాశముంది. భారత జట్టులోకి ఎంట్రీ ముందు అతని క్రికెట్ కెరీర్ ను గమనిస్తే అతని అద్భుతమైన ఆటకు నిదర్శనంగా అతని గణాంకాలు కనిపిస్తున్నాయి.
సర్ఫరాజ్ ఖాన్ 45 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 3,912 పరుగులు చేశాడు ఇంగ్లండ్ లయన్స్‌పై ఇండియా ఏ విజయం సాధించిన సమయంలో సర్ఫరాజ్ 160 బంతుల్లో 161 పరుగులతో చెలరేగాడు. జనవరి 24-27 వరకు జరిగిన అనధికారిక టెస్టులో సర్ఫరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్ లో స్థిరంగా రాణిస్తూ.. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొవడంతో పాటు అటాకింగ్ గేమ్ తో మిడిల్ ఆర్డర్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే, షార్ట్-పిచ్ బౌలింగ్ ను ఎదుర్కొవడంలో బలహీనంగా ఉన్నాడు.
సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ గణాంకాలు..
సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్
ముంబై బ్యాటర్ 2014లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. డిసెంబర్ 28న గ్రూప్ A రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ అరంగేట్రం చేశాడు. కానీ అతను తన మొదటి మ్యాచ్‌లో పెద్దగా పరుగులు చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 45 మ్యాచ్‌ల్లో 3,912 పరుగులు సాధించాడు. అలాగే, 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అజేయంగా 301 పరుగులు చేయడం అతని వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు. 2019-2020 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఉత్తరప్రదేశ్‌పై ఈ స్కోరును నమోదుచేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని సగటు 69.85గా ఉండటం విశేషం.
సర్ఫరాజ్ ఖాన్ లిస్ట్ ఏ క్రికెట్
మార్చి 2, 2014లో ముంబై విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా సర్ఫరాజ్ తన లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో సర్ఫరాజ్ ఖాన్ 37 మ్యాచ్‌లలో 629 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 117 పరుగులు. లిస్ట్ ఏ క్రికెట్‌లో అతని సగటు 34.94గా ఉంది.
సర్ఫరాజ్ ఖాన్ టీ20 క్రికెట్
ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. టీ20 క్రికెట్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు 96 మ్యాచ్ లను ఆడాడు. 1,187 పరుగులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 67 పరుగులుగా ఉన్నాయి. టీ20 క్రికెట్ లో అతని సగటు 22.41గా ఉంది.
దేశవాళీ క్రికెట్ లో సరికొత్త రికార్డులు
సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించడమే కాకుండా రికార్డు బద్దలు కొట్టాడు. 2019/2020 రంజీ సీజన్‌లో, సర్ఫరాజ్ ముంబైకి స్టార్ పెర్ఫార్మర్. అప్పటి నుండి, అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 82.46 సగటుతో ఉన్నాడు. 2019-2020 సీజన్‌లో, సర్ఫరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 154.66 సగటుతో 928 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అతని సగటు 154.66 ఒక్క రంజీ సీజన్‌లో ఏ బ్యాటర్‌కైనా రెండవ అత్యధికం ఇది. 2021/2022 సీజన్‌లో సర్ఫరాజ్ మరోసారి 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో బ్యాటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన సర్ఫరాజ్ నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు చేశాడు.
యువరాజ్ సింగ్ నాయకత్వంలో ఆడనున్న బాబర్ ఆజం సహా పలువురు పాకిస్తాన్ ప్లేయర్లు !
రెండు వరుస రంజీ సీజన్లలో 900-ప్లస్ పరుగులు చేసిన సర్ఫరాజ్ వరుసగా రెండు సీజన్లలో 900-ప్లస్ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. దానికి తోడు, రంజీ ట్రోఫీ సీజన్‌లో రెండుసార్లు 900 పరుగుల మార్క్‌ను అధిగమించిన మూడో బ్యాటర్‌గా కూడా సర్ఫరాజ్ నిలిచాడు. 2020 నుండి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ 82.40 కంటే ఎక్కువ సగటుతో 2,000-ప్లస్ పూర్తి చేసిన మరే ఇతర బ్యాటర్ లేడే. అయినా అతను భారత జట్టు పిలుపు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో అరంగేట్రం కోసం సిద్ధమయ్యాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు.
చరిత్ర సృష్టించిన చెన్నై మాజీ ప్లేయర్ ఇమ్రాన్ తాహిర్.. టీ20ల్లో మరో రికార్డు..
- BCCI
- Ben Stokes
- England
- IND vs ENG
- IND vs ENG Test Records
- India
- India vs England
- India vs England 3rd Test
- India-England Test match
- India-England Test series
- India-England cricket
- Indian national cricket team
- James Anderson
- Ranji Trophy
- Ravichandran Ashwin
- Sarfaraz Khan
- Sarfaraz Khan records
- Sarfaraz Khan's cricket career
- Test cricket records
- cricket
- domestic cricket
- games
- sports