ముంబై: సర్ఫరాజ్ ఖాన్ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దాంతో బ్యాటింగ్ కు దిగవద్దని అనుకున్నాడు. కానీ, మైదానంలోకి అడుగు పెట్టి బ్యాట్ ను ఝళిపించి ట్రిపుల్ సెంచరీ బాదాడు. ఈ విషయాన్ని సర్ఫరాజ్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. గత రెండు మూడు రోజుల నుంచి తాను జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన తెలిపాడు.

తన 301 పరుగుల ద్వారా 41 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు స్కోరును పరుగులు తీయించాడు. అతని పరుగుల ధాటితో ఉత్తరప్రదేశ్ చేసిన 625 పరుగులను ముంబై దాటేసి మూడు పాయింట్లను సాధించింది. 

నిజానికి తాను బ్యాటింగ్ కు దిగాలని అనుకోలేదని, తన స్థానంలో అడు భాయ్ (తారే) బ్యాటింగ్ కు దిగుతాడని అనుకున్నానని, తాను జ్వరంతోనూ దగ్గుతోనూ బాధపడుతున్నానని, గత రెండు మూడు రోజులుగా తనకు బాగా లేదని, కానీ తాను వెళ్లి బ్యాటింగ్ చేయడమే మంచిదని చివరి నిమిషంలో అనుకున్నానని ఆయన వివరించాడు. 

Also Read: సర్ఫరాజ్ ఖాన్ 300 బాదేశాడు: సెహ్వాగ్ ను మరిపించి, రోహిత్ శర్మ సరసన

సోమవారం రాత్రి కూడా తనకు బాగా లేదని, మిడిల్ లో ఉంటే తన లాంటి ఆటగాడు ఆటను మలుపు తిప్పగలడని తాను భావించానని, అందువల్ల తాను బ్యాటింగ్ కు దిగానని సర్ఫరాజ్ చెప్పాడు. చివరకి వరకు తాను బ్యాటింగ్ చేయగలనని అనుకోలేదని, ఎంత వరకు సాధ్యమైతే అంతవరకు సాగితే జట్టుకు ఉపయోగపడుతుందని భావించానని అన్నాడు. 

తీవ్రమైన అలసట ఉందని, ఇక చాలు అని టీ విరామ సమయంలో అనుకున్నానని, 250 పరుగులు చేసిన తర్వాత కూడా ఇక చాలు అని అనుకున్నాని, రిటైర్ అవుదామని భావించానని, అయితే జట్టు తనకు మద్దతుగా నిలిచిందని ఆయన వివరించాడు. 600 పరుగుల స్కోరు చేసిన తర్వాత వారిని కూడా వారిని కూడా 600 పరుగుల వరకు ఫీల్డింగ్ చేయించగలిగామని అనిపించిందని, ఇతర కారణాలు కూడా ఉన్నాయని, అందుకే తాను టైట్ గా ఆడానని సర్ఫరాజ్ చెప్పాడు.

షాట్ సెలెక్షన్ విషయంలో సర్ఫరాజ్ మెరుగయ్యాడని, పరిణతి సాధించాడని ముంబై కెప్టెన్ ఆదిత్య తారే అన్నాడు. నాలుగేళ్ల క్రితం తమ జట్టులోకి వచ్చిన తర్వాత ఎర్ర బంతితో సరిగా ఆడలేడని అనిపించిందని ఆయన అన్నాడు. ప్రస్తుతం బ్యాటింగ్ విషయంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడని తారే సర్ఫరాజ్ ను ప్రశంసించాడు. ఎల్లవేళలా ప్రాక్టీస్ చేస్తుంటాడని, అన్ని వేళలా సంసిద్ధడవుతాడని, అతని మరింతగా మెరుగయ్యే క్రికెటర్ అని అన్నాడు.