Asianet News TeluguAsianet News Telugu

పురుషుల జట్టు కోచ్ గా తొలిసారి మహిళా క్రికెటర్ సారా టేలర్

ఇంగ్లండ్‌లోని దేశవాలీ జట్టైన ససెక్స్‌కు టేలర్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. సమకాలీన క్రికెట్‌లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా టేలర్‌ పేరు పొందిన విషయం తెలిసిందే.

Sarah Taylor makes history by becoming 1st female coaching staff in English County
Author
Hyderabad, First Published Mar 17, 2021, 3:19 PM IST

ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సాధించింది. ఆమెను పురుషుల జట్టు కోచ్ గా నియమించారు. తొలిసారి ఓ పురుషుల జట్టుకు మహిళను వికెట్ కీపింగ్ కోచ్ గా ఎంపికైంది. ఇంగ్లండ్‌లోని దేశవాలీ జట్టైన ససెక్స్‌కు టేలర్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. సమకాలీన క్రికెట్‌లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా టేలర్‌ పేరు పొందిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''ససెక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా పనిచేయనుండడం సంతోషంగా ఉంది. ఆ జట్టులో ప్రతిభావంతమైన క్రికెటర్ల బృందం ఉంది. వారితో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా అనుభవం.. నైపుణ్యాలను వారికి పంచి నా వంతు సహకారం అందిస్తా. వికెట్‌ కీపింగ్‌లోని ప్రాథమిక సూత్రాలపై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది.

సారా టేలర్‌ ఇంగ్లండ్‌ తరపున  10 టెస్టుల్లో 300 పరుగులు, 126 వన్డేల్లో 4056 పరుగులు, 90 టీ20ల్లో 2177 పరుగులు సాధించింది. ఇక వికెట్‌కీపర్‌ మూడు ఫార్మాట్లు కలిపి 104 స్టంపింగ్స్‌.. 128 క్యాచ్‌లు అందుకుంది. ఇంగ్లండ్‌ జట్టు 2017 ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌ గెలవడంలో సారా టేలర్‌ కీలకపాత్ర పోషించింది. 2019లో టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios