అర్జున్, సారా టెండూల్కర్‌లతో పాటు యంగ్ క్రికెటర్లు, తమ సోదరీమణులతో వీడియో కాల్‌లో మాట్లాడిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ముంబై ఇండియన్స్...

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ. రాఖీ పౌర్ణమి నాడు ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, తన తమ్ముడు అర్జున్ టెండూల్కర్‌ని బాగా మిస్ అవుతోందట. ప్రస్తుతం ఐపీఎల్ 2021 ప్రిపరేషన్స్‌లో భాగంగా అర్జున్ టెండూల్కర్, యూఏఈలో ముంబై ఇండియన్స్‌ క్యాంపులో ఉన్నాడు. 

దీంతో రాఖీ పండగ సందర్భంగా అక్క సారా టెండూల్కర్‌కి వీడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు అర్జున్. ‘గత ఏడాది కూడా నువ్వు గిఫ్ట్ ఇవ్వలేదు...’ అంటూ సారా, అర్జున్‌ టెండూల్కర్‌ని ఏడిపించింది. దానికి అర్జున్, వచ్చేటప్పుడు రెండు గిఫ్ట్‌లు తీసుకొస్తానంటూ చెప్పాడు...

Scroll to load tweet…

అర్జున్, సారా టెండూల్కర్‌లతో పాటు ముంబై ఇండియన్స్‌లోని క్రికెటర్లు అన్మోల్‌ప్రీత్ సింగ్, యుద్‌వీర్ సింగ్, ఆదిత్య తారే తమ సోదరీమణులతో వీడియో కాల్‌లో మాట్లాడిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేసి, రాఖీ శుభాకాంక్షలు తెలిపింది ముంబై ఇండియన్స్...

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సారా టెండూల్కర్, ‘బెస్ట్ బ్రదర్ ఎవర్’ అంటూ కాప్షన్ ఇచ్చింది. సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్‌ని ఐపీఎల్ 2021 వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.

ఐపీఎల్ 2021 ఆక్షన్‌లో ఆఖరిగా వేలానికి వచ్చిన ప్లేయర్ అర్జున్ టెండూల్కరే. అయితే ఫేజ్ 1లో జరిగిన మ్యాచుల్లో అర్జున్ టెండూల్కర్, డగౌట్‌లో కూడా కనిపించకపోవడం విశేషం. ఆదిత్య తారే వంటి ఎందరో క్రికెటర్లు, ముంబై టీమ్‌లో ఉన్నా... స్టార్ ప్లేయర్ల కారణంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు.