ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ముద్దుల కుమార్తె సారా టెండుల్కర్ ప్రేమలో పడిందా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. యువ ఇండియన్ క్రికెటర్ తో సారా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ యువక్రికెటర్ ఎవరో కాదు.. శుభమన్ గిల్. దీనికి కారణమేంటో తెలుసా.. వీరిద్దరూ సోషల్ మీడియాలో  ఒకరిని మరొకరు ఫాలో కావడమే.

అంతేకాదు.. వీరిద్దరూ ఒకరు పోస్ట్ చేసిన వాటిని మరోకరు లైక్ చేసుకుంటున్నారు. ఇక్కడి వరకు ఓకే. కానీ ఇటీవల ఇద్దరి టేస్ట్ ఒకటే అన్నట్టుగా ఒకే టైమ్ లో ఒకే కామెంట్ పెట్టారు. దానిని నెటిజన్స్ పసిగట్టేశారు. వీరిద్దరి మధ్య ఏదో సాగుతుందని కథలు అల్లేస్తున్నారు. ఇటీవల గిల్ ఓ చిత్రాన్ని ‘ఐ స్పై’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగామ్‌లో పోస్ట్ చేశాడు. అదే సమయంలో సారా టెండుల్కర్ సైతం తన ఫొటో పెట్టి ‘ఐ స్పై’ అని పోస్ట్‌ చేసింది. దీంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది.

ఇప్పటి వరకు దీనిపై వీరిద్దరూ స్పందించలేదు. కానీ.. ఒక్క పోస్టుతో వారిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పడం కరెక్ట్ కాదని కొందరు భావిస్తుండగా.. కొందరైతే..ఈ రూమర్ నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సచిన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.