పీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంజూ శాంసన్...మొదటి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న యంగ్ వికెట్ కీపర్ కెప్టెన్... మూడు మ్యాచుల్లో ఓ విజయం అందుకున్న రాజస్థాన్ రాయల్స్...

టాలెంట్ ఉన్నా, నిలకడైన ప్రదర్శన ఇవ్వని కారణంగా టీమిండియాలో స్థిరమైన చోటు దక్కించుకోలేకపోతున్నాడు యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంజూ శాంసన్, మొదటి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత ఎప్పటిలాగే రెండు మ్యాచుల్లో విఫలమైన సంజూ శాంసన్, తన ఆటతీరు మాత్రం మార్చుకోనని చెబుతున్నాడు. తాజాగా పంచె కట్టులో మెరిసిపోతున్న సంజూ శాంసన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది రాజస్థాన్ రాయల్స్.

Scroll to load tweet…

‘మలయాళీ పోలియాడా’ (మలయాళ పిల్లగాడా) అంటూ కాప్షన్ ఇచ్చిన ఈ ఫోటోకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ 2021 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం ఆర్ఆర్ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది.