సూర్యకుమార్ యాదవ్ ఆటతీరు, రోహిత్ శర్మ పై మండిపడుతున్న ఫ్యాన్స్..!
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్ టీమ్ లో ఉండటంతో, ఫ్యాన్స్ లో ఆందోళన మరింత ఎక్కువైందని చెప్పొచ్చు.
ఆసియా కప్ 2023లో సూపర్ 4 దశలో బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. అయితే, మిగిలిన మ్యాచ్ లన్నీ విజయం సాధించింది. దీంతో ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో, రోహిత్ శర్మ లైనప్‌లో 5 మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రముఖ్ కృష్ణ, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలు బరిలోకి దిగగా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో మ్యాచ్ ఓటమి కావడంతో, ఈ మార్పులే కారణం అనే విమర్శలు వినపడుతునన్ాయి.
అయితే రెండు విషయాలు భారతీయులకు చాలా ఆందోళన కలిగిస్తాయి. వారి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ,పేసర్లలో ప్రముఖ్ కృష్ణ, షమీ సరిగా లేకపోవడం విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బంగ్లా పరుగులు చేయకుండా కూడా కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ 250 పరుగులు సులభంగా చేసేసింది. వారి లోయర్ ఆర్డర్ చాలా స్వేచ్ఛగా స్కోర్ చేయడం ఆందోళనకు సంకేతం. రెండవది, సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మలు కూడా సరిగా ఆకట్టుకోలేకపోయారు.సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్ టీమ్ లో ఉండటంతో, ఫ్యాన్స్ లో ఆందోళన మరింత ఎక్కువైందని చెప్పొచ్చు.
నిన్నటి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. కీలక సమయంలో వికెట్ చేజార్చుకుని.. టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. ఈ ఇన్నింగ్స్ కూడా ఎన్నో తిప్పలు పడుతూ ఆడాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యాడు. టి20ల్లో నెంబర్ 1 బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం పేలవంగా ఉన్నాడు. టి20ల్లో అదరగొట్టడంతో అతడిని వన్డేల్లోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు వన్డేల్లో అతడు ఏ మాత్రం రాణించలేదు.
ప్రపంచ కప్ కోసం సంజూ శాంసన్ ని పక్కన పెట్టి, సూర్యకుమార్ యాదవ్ ని ఎంపిక చేయడం కూడా అందరినీ కలవర పెడుతోంది. వన్డేలు ఎలా ఆడాలో తెలియని సూర్యను ప్రపంచకప్ కు సెలెక్ట్ చేయడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ స్థానంలో సంజూ సామ్సన్ లేదా తిలక్ వర్మను తీసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు.
వన్డేల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కి సూర్య కంటే మెరుగైన రికార్డు ఉంది. అదే సమయంలో, వైఫల్యాలు ఉన్నప్పటికీ, సూర్య ఈ వైట్-బాల్ ఫార్మాట్‌లో సంజు కంటే ఎక్కువ అవకాశాలను పొందాడు. 13 ODIల్లో, సంజు 3 అర్ధ సెంచరీలతో 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు, 104 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. సూర్య 27 ODIల్లో 24.41 సగటుతో 537 పరుగులు, 2 అర్ధ సెంచరీలతో 99.81 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు.