Asianet News TeluguAsianet News Telugu

అనవసర రికార్డును సొంతం చేసుకున్న సంజు సాంసన్...మరొకటి కాకుండా ఉండేనా...?

ఈ ఏడాది చివర్లో ఉన్న టి20 వరల్డ్‌ కప్ టీం ను ఫైనలైజ్ చేయడానికి యువ ఆటగాళ్లను సాధ్యమైనంతవరకూ పరీక్షించాలనే ఉద్దేశంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఐదవరికే సన్నాహాలను ఆరంభించింది. తాజాగా కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్ మెన్ సంజూ సాంసన్ కూడా అవకాశం ఇచ్చింది. 

sanju samson adds an unwanted record to his name
Author
Mumbai, First Published Jan 11, 2020, 5:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నిన్నటి మ్యాచులో అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో భారత జట్టు అదరగొట్టింది. ఓపెనర్లు రాహుల్, ధావన్ ల అర్థ సెంచరీలు, చివర్లో మనీష్ పాండే, శార్దూల్ ఠాకూర్ ల విధ్వంసకర ఇన్నింగ్స్ తో భారత్ భారీ స్కోర్ చేసింది. 

ఈ ఏడాది చివర్లో ఉన్న టి20 వరల్డ్‌ కప్ టీం ను ఫైనలైజ్ చేయడానికి యువ ఆటగాళ్లను సాధ్యమైనంతవరకూ పరీక్షించాలనే ఉద్దేశంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఐదవరికే సన్నాహాలను ఆరంభించింది. తాజాగా కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్ మెన్ సంజూ సాంసన్ కూడా అవకాశం ఇచ్చింది. 

చివరిదైన మూడో టీ20లో సాంసన్ కు తుది జట్టులో అవకాశం కల్పించారు. ఈ మ్యాచ్‌కు ముందు సంజు సాంసన్ కేవలం ఒకేఒక అంతర్జాతీయ టీ20 ఆడాడు. ఆ తర్వాత దేశవాళీ, ఐపీఎల్‌లలో రాణించినా జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. పోనీ జట్టులో స్థానం సంపాదించినా ప్లేయింగ్ ఎలెవన్ లో మాత్రం స్థానం దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. 

అప్పుడెప్పుడో దాదాపు 5 సంవత్సరాల కింద, 2015లో జింబాబ్వేతో చివరిసారి ఆడిన సాంసన్, నాలుగు సంవత్సరాల తరువాత ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ ఎంపికకు కేవలం కొన్ని రోజులముందే... విజయ్ హజారే ట్రోఫీలో చేసిన డబల్ సెంచరీ పుణ్యమాని ఇలా ఆ బాంగ్లాదేశ్  సిరీస్ కి ఎంపికయ్యాడు.

బంగ్లాదేశ్‌ సిరీస్ లో అతడికి అవకాశం మాత్రం లభించలేదు. కేవలం డ్రింక్స్ అందించడానికి మాత్రమే పరిమితమయ్యాడు. అప్పట్లో బీసీసీఐ మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.  

ఇక ఆ తరువాత విండీస్ సిరీస్ కి సాంసన్ ను ఎంపిక చేయలేదు. మరోసారి అభిమానులు విపరీతంగా విరుచుకుపడడంతో... ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణాంముగా వైదొలగడంతో అతడిని జట్టులోకి తీసుకున్నారు. 

ఆ సిరీస్ లో కూడా  సాంసన్ మళ్ళీ డగ్ అవుట్ కె పరిమితం అయ్యాడు. అక్కడకూడా  అతడు డ్రింకులు మోయడానికి పరిమితమయ్యాడు తప్ప బాట్ పెట్టె అవకాశం మాత్రం లభించలేదు. 

ఆ తరువాత ప్రస్తుత  శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో ను సాంసన్ కు చోటు లభించింది. ఈ సిరీస్ లో తొలి మ్యాచు వర్షార్పణమవ్వగా, రెండవ మ్యాచ్ లో కూడా  సాంసన్  కు చోటు దక్కలేదు. ఇక ఈ సిరీస్ లో కూడా  సాంసన్  ఆడనట్టే అని అందరూ అనుకుంటున్నా తరుణంలో.... అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. 

ఇన్నాళ్లకు  తన కెరీర్‌లో రెండో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన సాంసన్.. ఒక అరుదైన అనవసరపు చెత్త రికార్డును కూడా మూటకట్టుకున్నాడు. భారత్‌ తరఫున తన తొలి మ్యాచ్‌కు ఆపై రెండో మ్యాచ్‌కు మధ్య గ్యాప్ చాలా అధికంగా ఉంది. ఈ గ్యాపే ఇప్పుడు ఈ చెత్త రికార్డును అతగాడికి తెచ్చిపెట్టింది. 

2015  తరువాత దాదాపు 5 సంవత్సరాల అనంతరం, రోజుల్లో మాట్లాడుకుంటే.... 1637 రోజుల తరువాత   ఆడాడు. భారత్‌ జట్టు ఈ గ్యాప్ లో 73 అంతర్జాతీయ టీ20లు ఆడింది. అంటే సాంసన్ 73 అంతర్జాతీయ మ్యాచ్‌లను మిస్సయ్యాడు. భారత్‌ తరఫున ఒక ఆటగాడికి తొలి టీ20 మ్యాచ్‌కు రెండో టీ20 మ్యాచ్‌ కు అత్యధిక గ్యాప్ కలిగిన ప్లేయర్ గా సాంసన్ నిలిచాడు. 

ఈ జాబితాలో ఆతరువాత ఉమేశ్‌ యాదవ్‌ ఉన్నాడు. 65 టీ20 మ్యాచ్‌ల గ్యాప్ తరువాత ఉమేష్ రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్థానంలో దినేశ్‌ కార్తీక్‌(56 మ్యాచ్‌లు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.  

ఇదంతా పక్కకు పెడితే.... నిన్న వచ్చిన అవకాశాన్ని కూడా సంజు సాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇలా సంజు శాంసన్ ఫెయిల్ అవడంతో ఆయన అభిమానుల ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. ఇక ఈ పెర్ఫార్మన్స్ నేపథ్యంలో నెక్స్ట్ మ్యాచ్ కి గనుక ఎక్కువ గ్యాప్ వస్తే మరో చెత్త రికార్డును సొంతం చేసుకుంటాడు సాంసన్. 

Follow Us:
Download App:
  • android
  • ios