చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిపోయి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలకు గండికొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిపోయి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలకు గండికొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పంత్‌ను ఆకాశానికెత్తేశాడు. అతడిని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. ఇలాంటి ఆటగాడిని భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని, సహజంగా ఆడనివ్వాలని సూచించాడు.

పంత్‌ను జట్టులోకి తీసుకున్నా, తీసుకోకపోయినా అతడి ఆటతీరు మాత్రం మారదని సంజయ్ అభిప్రాయపడ్డాడు. కాగా, విశాఖపట్నంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పంత్ విధ్వంసం సృష్టించాడు.

21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు సాధించి సన్‌రైజర్స్‌ను ఇంటికి పంపాడు. దీంతో శుక్రవారం జరగనున్న క్వాలీఫైయర్-2 మ్యాచ్‌లో అందరి చూపు ఇతనిపై పడింది.