Asianet News TeluguAsianet News Telugu

Sania Mirza: భర్త సిక్సర్ల్ కొడుతుంటే క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేసిన సానియా మీర్జా..

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza).. ఆదివారం షార్జా క్రికెట్‌ గౌండ్‌లో సందడి చేసింది. తన భర్త, పాకిస్తాన్ ఆల్‌ రౌండర్ షోయబ్ మాలిక్‌ను (Shoaib Malik) ఉత్సాహరుస్తూ కనిపించింది. అతడు సిక్సర్స్ బాదుతుంటే.. నిలబడి క్లాప్స్ కొడుతూ సంబరాలు చేసుకుంది.

Sania Mirza cheer husband Shoaib Malik to batting against Scotland
Author
Hyderabad, First Published Nov 8, 2021, 10:43 AM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza).. ఆదివారం షార్జా క్రికెట్‌ గౌండ్‌లో సందడి చేసింది. టీ 20 వరల్డ్ కప్ సూపర్‌–12 లీగ్‌ దశలో భాగంగా పాకిస్తాన్ (Pakistan), స్కాట్లాండ్‌ల (Scotland) మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించిన సానియా.. తన భర్త, పాకిస్తాన్ ఆల్‌ రౌండర్ షోయబ్ మాలిక్‌ను ఉత్సాహరుస్తూ కనిపించింది. ఈ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సానియా గ్యాలరీలో కూర్చొంది. షోయబ్ మాలిక్ (Shoaib Malik) కేవలం 18 బంతుల్లోనే 54 పరుగులు చేసి సంచలనం సృష్టించడంలో ఆమె ఆనందంలో ముగినిపోయింది. అతడు సిక్సర్స్ బాదుతుంటే.. నిలబడి క్లాప్స్ కొడుతూ సంబరాలు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also read: T20 Worldcup 2021: సూపర్ 12లో పాకిస్తాన్ క్లీన్ స్వీప్... స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ...

ఇక, టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్చేసిన అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన షోయబ్ మాలిక్.. ‘అవును నేను మంచి ఫామ్‌లో ఉన్నాను. కానీ జట్టుకు సహాయం చేయడానికి నన్ను నేను మరింత స్థిరంగా ఆడాలని అనుకుంటున్నాను. మొత్తంమీద, నేను ఫిట్‌గా ఉన్నానని భావిస్తున్నాను. రాబోయే మ్యాచ్‌ల్లో మేము అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి’ అని అన్నారు.

 

టీ20 సూపర్-17‌ లీగ్‌ దశను పాకిస్తాన్ చాలా గ్రాండ్‌గా ముగించింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించి అజేయంగా నిలిచింది. ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. పాకిస్తాన్‌ 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టు.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. 10 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత బాబార్ ఆజమ్‌ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.

 

ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు దిగిన షోయబ్ మాలిక్.. పాక్ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. క్రీజ్‌లో వచ్చినప్పటీ నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సిర్ల వర్షం కురిపించారు.  18 బంతులు ఎదుర్కొన్న షోయబ్‌... ఒక ఫోర్‌తో పాటు ఆరు సిక్స్‌లు బాదాడు. మొత్తంగా 54 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. షోయబ్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ జట్టు.. చివరి 5 ఓవర్లలో 77 పరుగులు రాబట్టింది. ఇక, నవంబర్ 11న జరిగే రెండో సెమీఫైనల్లో పాక్ టీమ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios