రాజస్థాన్ రాయల్స్‌కి సందీప్ శర్మ! పంజాబ్ కింగ్స్‌లోకి మాథ్యూ షార్ట్... ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్‌లోకి...
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో రాజస్థాన్ రాయల్స్‌లోకి సందీప్ శర్మ.. ఐపీఎల్‌లో 104 మ్యాచులు ఆడి 114 వికెట్లు తీసిన సందీప్, విరాట్‌పై ఘనమైన రికార్డు... జానీ బెయిర్ స్టో ప్లేస్‌లో యంగ్ సెన్సేషన్‌ని పట్టుకొచ్చిన పంజాబ్ కింగ్స్..

ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు ఉన్న బౌలర్ సందీప్ శర్మ. 10 సీజన్ల అనుభవం ఉన్న సందీప్ శర్మ, ఐపీఎల్‌లో మోస్ట్ అండర్‌రేటెడ్ బౌలర్. ఎంత బాగా బౌలింగ్ వేస్తున్నా అటు సెలక్టర్లు మాత్రమే కాదు, ఫ్రాంఛైజీలు కూడా సందీప్ శర్మకు ఇవ్వాల్సినంత గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదనే చెప్పాలి...
ఐపీఎల్ 2023 మినీ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిన సందీప్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో చేరాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్‌లో సందీప్ శర్మను తీసుకుంది రాయల్స్. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది...
వాస్తవానికి జస్ప్రిత్ బుమ్రా ప్లేస్‌లో ముంబై ఇండియన్స్, సందీప్ శర్మను తీసుకోవడానికి ఆసక్తి చూపించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ముంబై ఇండియన్స్ కంటే ముందుగానే సందీప్ శర్మను కలిసిన రాజస్థాన్ రాయల్స్, అతనితో ఒప్పందం కుదుర్చుకుందట. దీంతో ఇప్పటికే ఐపీఎల్ 2023 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ క్యాంపులో చేరిపోయాడు సందీప్ శర్మ..
అలాగే గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో స్థానంలో అన్‌క్యాప్డ్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చింది పంజాబ్ కింగ్స్. బిగ్ బాష్ లీగ్ 2023 టోర్నీలో 458 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్, 11 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలిచాడు. బెయిర్ స్టో స్థానంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకే మాథ్యూ షార్ట్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చేసింది పంజాబ్ కింగ్స్..
నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కీ-బౌలర్‌గా ఉన్న సందీప్ శర్మ, ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌కి వెళ్లాడు. 2018లో సందీప్ శర్మను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 2022 మెగా వేలంలో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే పంజాబ్ కింగ్స్‌లోకి వెళ్లాడు సందీప్ శర్మ... 2023 సీజన్‌లోనూ బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడబోతున్నాడు సందీప్..
ఐపీఎల్‌లో 104 మ్యాచులు ఆడిన సందీప్ శర్మ, 26.33 సగటుతో 114 వికెట్లు పడగొట్టాడు. 2010 అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీతో పాటు, 2012 అండర్ 19 వరల్డ్ కప్ కూడా ఆడిన సందీప్ శర్మ, 2013లో ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేశాడు...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి అదరగొట్టాడు సందీప్ శర్మ... 2017లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌లను అవుట్ చేసిన సందీప్ శర్మ, ఒకే మ్యాచ్‌లో ఈ ముగ్గురినీ అవుట్ చేసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
2014 సీజన్‌లో 18 వికెట్లు పడగొట్టిన సందీప్ శర్మ, పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీని ఏడు సార్లు అవుట్ చేసిన సందీప్ శర్మ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతన్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు.. ఆశీష్ నెహ్రా ఆరుసార్లు, బుమ్రా నాలుగు సార్లు మాత్రమే కోహ్లీ వికెట్ తీశారు...
సందీప్ శర్మ బౌలింగ్‌లో ఐపీఎల్‌లో 72 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఏడుసార్లు అవుట్ అయ్యాడు... ఐపీఎల్ కెరీర్‌లో సందీప్ శర్మ 92 ఇన్నింగ్స్‌ల్లో పవర్ ప్లేలో 53 వికెట్లు తీయగా... 99 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు...