రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ధోనీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో తన సతీమణి సాక్షి ఓ డైలాగ్ చెప్పే విషయంలో ఇబ్బంది పడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. 

ఓ యాడ్ షూట్ లో బాగంగా సాక్షికి ఓ డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ చెప్పలేక సాక్షి ఇబ్బంది పడింది. దాంతో ధోనీ డైలాగ్ పేపర్ లాక్కుని దాన్ని చూసి సాక్షిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

"చూసి కూడా డైలాగ్ చెప్పలేకపోతున్నావు, ఇంకా డెలివర్ చేస్తావ్" అంటూ ధోనీ సాక్షిపై మండిపడ్డాడు. ఈ వీడియోను ఏడాది క్రితం చిత్రీకరించినట్లు ధోనీ తెలిపాడు. "కాలం చాలా వేగంగా మారుతుంది. ఇది ఏడాది క్రితం వీడియో" అని ధోనీ చెప్పాడు.

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల తర్వాత ధోనీ క్రికెట్ నుంచి విరామం తసుకున్నాడు. మొదట భారత సైన్యంలో శిక్షణ పొందాడు. ఆ తర్వాత రాంచీ చేరుకుని కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సరదా సమయం వెచ్చిస్తున్నాడు.