టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ను ఎంతలా ఇష్టపడతాడే బైకులు, కార్లంటే కూడా అదే స్థాయిలో ఇష్టసడతాడు. మార్కెట్లో విడుదలయ్యే   లేటెస్ట్ స్పోర్ట్స్ వాహనాలను  మరీ ఎక్కువగా  ఇష్టపడుతుంటాడు. ఇలా అతడి గ్యారేజీలోకి ఇప్పటికే పదుల సంఖ్యలో వాహనాలు చేరాయి. ఇప్పుడు మరో లేటెస్ట్ వెర్షన్ వాహనం కూడా ఆ గ్యారేజీలోకి చేరనుంది. 

ధోని ప్రస్తుతం భారత ఆర్మీ గౌరవ లెప్టినెంట్ హోదాలో జమ్మూ కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇలా ఇంటికి దూరంగా వుంటూ దేశసేవలో మునిగిపోయిన భర్త కోసం సాక్షి ఓ అరుదైన గిప్ట్ ను  రెడీ చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్న ఆమె ధోనికి అందించే ఆ గిప్ట్ కు సంబంధించిన పోటోను కూడా పోస్ట్ చేసింది. 

''మా ఇంటికి చేరిన రెడ్ బీస్ట్ ట్రాక్ హావ్క్ 6.2 హెమీ కి స్వాగతం. మహీ... నీ గిప్ట్ ఫైనల్ గా మా దగ్గరకు చేరింది.  భారతదేశంలో మొట్టమొదటి మరియు ఏకైక కారుగా నీవద్దకు చేరేందుకు సిద్దమయ్యింది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం.'' అంటూ సాక్షి  ఇన్స్టాగ్రామ్ లో సదరు వాహనానికి చెందిన ఫోటోను జతచేసి పోస్ట్  చేసింది. 

కొన్నిరోజుల క్రితమే భారత ఆర్మీకి సేవలందించడానికి ధోని జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాకు చేరుకున్నాడు. అక్కడ తన బృందంతో కలిసి సెక్యూరిటీ విధులు  నిర్వర్తిస్తున్నాడు. ఇలా అతడు ఆగస్ట్ 15న జరగనున్న స్వాతంత్ర్య ధినోత్సవ వేడుకలను నూతనంగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లో జరుపుకోనున్నాడు. ఆ కార్యక్రమంలో ఆర్మీలో అతడికి కేటాయించిన విధులు ముగియనున్నాయి కాబట్టి నేరుగా తన ఇంటికి చేరుకోనున్నాడు. 

ఇలా దేశసేవను ముగించుకుని ఇంటికి చేరుకునే భర్తను సర్ ప్రైజ్ చేయడానికి సాక్షి ఓ అందమైన గిప్ట్ ను రెడీ చేసింది. వాహనాలంటే ఎంతో ఇష్టపడే ధోని కోసం 
‘ద జీప్‌ గ్రాండ్‌ చెరోకీ ’ని ఆమె సిద్దం చేసింది. ఇప్పటికే ఆ వాహనం ధోని  ఇంటికి కూడా చేరుకుంది. 

ధోనికి వాహనాలంటే ఎంత ఇష్టమై మనం కొన్ని మ్యాచుల సందర్భంగా ప్రత్యక్షంగా వీక్షించాం. ఏకంగా మైదానంలోనే తన సహచరులను ఎక్కించుకుని బైక్ పై రయ్యి రయ్యి మంటూ దూసుకుపోవడం చూశాం. అలాగే తనకెంతో ఇష్టమైన వాహనాలను ధోనీ స్వయంగా శుభ్రపర్చుకునే ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇలాంటి  వాటి ద్వారా ధోని ఎంతటి  వాహన ప్రియుడో అర్థమవుతుంది. అతడి గ్యారేజీలో ఇప్పటికే ఫెరారీ 599 జీటీవో, హమ్మర్‌ హెచ్‌2, జీఎంసీ సీరా వంటి రేసింగ్ కార్లు,    కవాసాకి నింజా హెచ్‌2,  కాన్ఫిడరేట్‌ హెల్‌కాట్‌, బీఎస్ఎలు బైకులు వున్నాయి. వీటి సరసకు మరో లేటెస్ట్ మోడల్ చేరనుంది.