అందరూ ఊహించినట్టే ముంబై ఇండియన్స్‌లోకి సచిన్ వారసుడు..అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని మిగిలిన జట్లు...

అందరూ ఊహించినట్టుగానే సచిన్ టెండూల్కర్ వారసుడు ముంబై ఇండియన్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ వేలం ఆఖర్లో వేలానికి వచ్చిన అర్జున్ టెండూల్కర్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. 

ముందుగా ఊహించినట్టుగానే సచిన్ టెండూల్కర్ సొంత జట్టు లాంటి ముంబై ఇండియన్స్, అతన్ని బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది. సచిన్ టెండూల్కర్ 2008లో ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వగా, 2021 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

పవన్ నేగీని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. ఆకాశ్ సింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్.