కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదట్లొ క్రీడాకారులంతా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ఒకరిపై మరొకరు విసిరారు.

అయితే... ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన సతీమణి అనుష్క శర్మ జుట్టు కత్తిరించింది. ఆ తర్వాత సురేష్ రైనా కి కూడా ఆయన భార్య అలానే హెయిర్ కట్ చేశారు. తాజాగా... సచిన్ వంతు వచ్చింది.

 

అయితే.. ఆయన మాత్రం తన హెయిర్ కట్ చేసే ఛాన్స్ భార్య అంజలికి ఇవ్వలేదు. స్వయంగా తానే కట్ చేసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా కనీసం సెలూన్స్ కూడా ఓపెన్ చేయడం లేదు కదా.. దీంతో అందరూ ఇంట్లోనే కత్తెరకు పనిచెబుతున్నారు.

అయితే సచిన్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. అందులో టెండూల్కర్ తన కొత్త హెయిర్  కట్ చేసుకుంటున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు మరియు "స్క్వేర్ కట్స్ ఆడటం నుండి నా సొంత హెయిర్ కట్స్ చేయడం వరకు కొత్త పనులు చేయడం ఎప్పుడు నిన్ను ఆనందిస్తాను" అని తెలిపారు.

 అయితే ఇప్పుడు సచిన్ హెయిర్ కట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఆయన అభిమానులను ఈ ఫోటోలు ఇప్పుడు తెగ అలరిస్తున్నాయి. ఇక సచిన్ ఈ కరోనా వైరస్ పై భారత ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అవగాహనా కల్పిస్తూనే ఉన్నారు.