Asianet News TeluguAsianet News Telugu

15-8-47 ఆ డేట్‌తో సచిన్ టెండూల్కర్‌కి స్పెషన్ రిలేషన్‌... సర్‌ప్రైజ్ అయిన మాస్టర్...

తన ఆఖరి టెస్టులో 74 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్... అంతకుముందు సరిగ్గా భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని సూచించేటన్ని పరుగులతో మాస్టర్...

Sachin Tendulkar have special relation with Indian Independence Day, Master Surprised
Author
India, First Published Aug 15, 2021, 3:28 PM IST

క్రికెట్ అనేది ఓ మతం అయితే ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్... టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, క్రికెట్‌లో 34 వేలకు పైగా పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు, అత్యధిక బౌండరీలు, అత్యధిక మ్యాచులు, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, అత్యధిక మ్యాన్ ఆఫ్ సిరీస్‌లు... ఇలా క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డుల గురించి రాస్తూ పోతే పుస్తకం కాదు, ఓ గ్రంథమే అవుతుంది... 


అయితే భారత స్వాతంత్య్ర దినోత్సవానికి సచిన్ టెండూల్కర్‌కి మధ్య ఓ వింత సంబంధం ఉంది. ‘మాస్టర్’ తన ఆఖరి టెస్టుకి ముందు 199 టెస్టుల్లో సరిగ్గా 15847 పరుగులు చేశారు. అంటే దాన్ని విడదీసి చూస్తే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు 15-8-47 వస్తుంది...

ఫైనల్ టెస్టులో సచిన్ టెండూల్కర్ 74 పరుగులు చేయగా... భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి 74 ఏళ్లు అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ   కస్తుర్బ్ గుడిపాటి అనే క్రికెట్ విశ్లేషకుడు ట్వీట్ చేయగా... దానిపై సచిన్ టెండూల్కర్ స్పందించారు.

‘సంఖ్యలు ఇలా కూడా ఆడుకుంటాయని ఎప్పుడూ ఆలోచించలేదు... వాట్ ఏ కోఇన్సిడెన్స్... హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అంటూ కామెంట్ చేశారు సచిన్ టెండూల్కర్... తన కెరీర్‌లో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్కర్, వన్డేల్లో 49 సెంచరీలు, టెస్టుల్లో 51 సెంచరీలతో 34,347 పరుగులు సాధించారు. క్రికెట్‌కి రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్‌కి 2013లో భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ వరించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios