కరోనా నుంచి కోలుకున్న ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్, దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా బాధపడుతున్నవారి కోసం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా కారణంగా ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నవారికి సాయం చేసేందుకు 250+ మంది యువకులతో పనిచేస్తున్న‘మిషన్ ఆక్సిజన్’ అనే సంస్థకు తన వంతుగా రూ. కోటి ఆర్థిక సాయం చేశాడు.

దేశంలో మొదటిసారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించాడు సచిన్ టెండూల్కర్. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, ఆ సిరీస్ ముగిసిన తర్వాత కరోనా బారిన పడ్డారు.

ఆ తర్వాత కరోనా నుంచి కోలుకుని, బాధితుల కోసం సాయం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు వివిధ స్వచ్ఛంధ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సచిన్ ఆసక్తి చూపిస్తున్నారు.