ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ ఓ హోటల్ లో పాస్తా రుచి చూశారు. ఇదే విషయాన్ని దీనికి సంబంధించిన వీడియోని ఆయన షేర్ చేశాడు. అది చాలా రుచిగా ఉందని ఆయన క్యాప్షన్ లో పేర్కొన్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఫీల్డ్ లో కనిపించకపోయినా... సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటారు. ఆయన వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా... రకరకాల ఆహారాలు రుచులు టేస్ట్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా ఆయన సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు.
కాగా.. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ ఓ హోటల్ లో పాస్తా రుచి చూశారు. ఇదే విషయాన్ని దీనికి సంబంధించిన వీడియోని ఆయన షేర్ చేశాడు. అది చాలా రుచిగా ఉందని ఆయన క్యాప్షన్ లో పేర్కొన్నాడు.
ఈ వీడియోని సచిన్ ఆగస్టు 25వ తేదీన షేర్ చేయడం గమనార్హం. Pasatation అనే రెస్టారెంట్ లో ఆయన ఈ పాస్తాను రుచి చూశారు. అయితే.. ఒకరి రికమండేషన్ మేరకు ఆయన అక్కడకు వెళ్లి ఆ పాస్తా రుచి చూడటం గమనార్హం.
ఇంతకీ ఆయనకు ఆ పాస్తా రికమండ్ చేసింది ఎవరు అంటే... ఆయన ముద్దుల కుమార్తె సారా టెండుల్కర్ కావడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆయన క్యాప్షన్ లో కూడా పేర్కొన్నారు.
ఆయన వీడియో కి నెటిజన్ల నుంచి స్పందన కూడా బాగా వచ్చింది. మీతో కలిసి ఆ రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్నవారు ఎంత అదృష్టంవంతులో... అయితే.. వాళ్లెవరూ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. సచిన్ కొద్దిగా కూడా పట్టించుకోకుండా.. అక్కడ ఉన్నవారు వాళ్ల ఫుడ్ ని ఆస్వాదించడం నెటిజన్లలో చాలా మందికి నచ్చలేదు. ఆ విషయంపైనే ఎక్కువ మంది కామెంట్స్ చేయడం గమనార్హం.
లెజెండ్ సచిన్ టెండుల్కర్ రెస్టారెంట్ లో ఉంటే.. అందరూ తినడంలో బిజీగా ఉన్నారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.
