Asianet News TeluguAsianet News Telugu

ఇక్కడ పోయిందని, అక్కడ జోరు! SA20 Auctionలో కోట్లు కుమ్మరించిన సన్‌రైజర్స్... టాప్ 5లో మూడు...

ట్రిస్టన్ స్టబ్స్‌ని 9.2 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్... టాప్ 5లో మూడు సన్‌రైజర్స్‌వే...

SA20 Auction Highlights, Tristan Stubbs gets huge price Sunrisers Eastern Cape
Author
First Published Sep 20, 2022, 9:51 AM IST

సౌతాఫ్రికా 20 లీగ్ వేలంలో తొలి రోజు సన్‌రైజర్స్ జోరు కనిపించింది. ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసే విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యవహరించిన తీరు కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది...

అయితే సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఘనంగా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. అయితే సోమవారం కేప్ టౌన్ ఇంటర్నేషనల్ కన్వేన్షన్ సెంటర్‌‌లో జరిగిన సౌతాఫ్రికా 20 వేలంలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ ఫ్రాంఛైజీ... ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరించింది...

సౌతాఫ్రికా యంగ్ వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్‌ని ఏకంగా 9.2 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్. ఎంఐ కేప్ టౌన్, జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్  జట్లు కూడా ట్రిస్టన్ స్టబ్స్ కోసం గట్టిగా పోటీపడ్డాయి. అయితే ఈ పోటీలో 22 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్‌ని దక్కించుకుంది సన్‌రైజర్స్.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడే ట్రిస్టన్ స్టబ్స్, సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్‌కి ఆడబోతున్నాడు. స్టబ్స్‌ ఇప్పటిదాకా 160.65 స్ట్రైయిక్ రేటుతో 784 టీ20 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ప్రకటించిన జట్టులోనూ స్టబ్స్‌కి చోటు దక్కింది...

సౌతాఫ్రికా క్రికెటర్ రిలే రొస్సోవ్‌ని ప్రిటోరియా కేపిటల్స్‌ 6.90 మిల్లియన్ల సౌతాఫ్రికా డాలర్లకు కొనుగోలు చేసింది. రిలే కోసం కూడా ఎంఐ కేప్‌ టౌన్, జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్ పోటీలో నిలవడం విశేషం.32 ఏళ్ల రిలే రిస్సోవ్‌కి 6633 టీ20 పరుగులు ఉన్నాయి.ఐపీఎల్‌తో పాటు బీబీఎల్, పాక్ సూపర్ లీగ్ వంటి లీగుల్లో పాల్గొన్నాడు రిలే రిస్సోవ్...

సౌతాఫ్రికా యంగ్ బౌలర్ మార్కో జాన్సెన్‌ని 6.10 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లకు సొంతం చేసుకుంది సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడే మార్కో జాన్సెన్ కోసం అన్ని జట్లు ఆసక్తి చూపించాయి...

వేన్ పార్నెల్‌ని 5.6 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లకు కొనుగోలు చేసింది ప్రిటోరియా క్యాపిటల్స్. 24 ఏళ్ల వికెట్ కీపర్ డొనవన్ ఫెర్రీరియాని జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్ 5.6 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లకు దక్కించుకుంది.

జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్ జట్టులో ఫాఫ్ డుప్లిసిస్, మహీశ్ తీక్షణ, రొమారియా షిఫర్డ్, జన్నెమన్ మలాన్, అల్జెరీ జోసఫ్ వంటి ప్లేయర్లకు చోటు దక్కింది. పర్ల్ రాయల్స్ టీమ్‌లో జోస్ బట్లర్, ఒబెడ్ మెకాయ్, డేవిడ్ మిల్లర్, లుంగ ఎంగిడి,తంబ్రేజ్ షంసీ, జాసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్ వంటి సీనియర్లకు చోటు దక్కింది...

సౌతాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్‌తో పాటు వైట్ బాల్ కెప్టెన్ తెంబ భవుమా కూడా సౌతాఫ్రికా20 వేలంలో అమ్ముడుపోకపోవడం విశేషం. అలాగే సౌతాఫ్రికా20 వేలంలో పాల్గొన్న ఏకైక భారతీయుడు ఉన్ముక్త్ చంద్‌ని కొనుగోలు చేయడానికి కూడా ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios