IND vs SA 1st ODI : సఫారీలతో వన్డే వార్ కు సిద్దమైనా రాహుల్‌ సేన.. మరీ వరుణుడు సహకరించేనా ?

IND vs SA 1st ODI :దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా  టీ-20 సిరీస్‌ను సమం చేసినా.. తాజాగా వన్డే సమరానికి సిద్ధమైంది. ఆదివారం జొహన్నెస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. కేఎల్ రాహుల్‌ నేతృత్వంలోని యువ భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ను  విజయంతో ఆరంభించాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్ కు  వాతావరణం ఆటంకం కలిగిస్తుందా ? ఈ మ్యాచ్ సాఫీగా సాగేనా? అనే ప్రశ్నలు క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతున్నాయి. 

SA vs IND 1st ODI, Johannesburg Weather The Wanderers Stadium pitch  KRJ

IND vs SA 1st ODI Weather Report: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డ్రా అయిన విషయం తెలిసిందే.. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ వర్షం ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వన్డే సిరీస్‌కు రాహుల్ సేన సిద్దమైంది. మెుదటి వన్డే మ్యాచ్ వాండరర్స్ మైదానం వేదికగా జరుగనున్నది. అయితే ఈ మ్యాచ్ కు    వాతావరణం ఆటంకం కలిగిస్తుందా ? ఈ మ్యాచ్ సాఫీగా సాగేనా? అనే ప్రశ్నలు క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతున్నాయి. 

వాతావరణం మేఘాలు కమ్ముకుంటున్నాయి. కానీ, మంచి విషయం ఏమిటంటే.. భారత్- దక్షిణాఫ్రికా మధ్య మొదటి వన్డే మ్యాచ్‌కు ఎటువంటి ఆటంకం కలిగించకపోవచ్చు. నిజానికి ఈ మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లో ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 1.30 గంటలకు) ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ముగుస్తుంది. మ్యాచ్ సమయంలో జోహన్నెస్‌బర్గ్‌లో వర్షం పడే అవకాశం చాలా తక్కువ. మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం కేవలం 2 నుంచి 5 శాతం మాత్రమే. 

AccuWeather ప్రకారం.. జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం ఉదయం ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని, మిగిలిన రోజుల్లో ఎక్కువగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఆట ప్రారంభంలో ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది మరియు అది ముగిసే సమయానికి 23 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చు. ఒకవేళ వర్షం పడితే.. మ్యాచ్ కాస్తా ఆలస్యంగా ప్రారంభం కానున్నది. మిగిలిన సమయాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో 20 డిగ్రీల వరకు పడిపోవచ్చు. పగటిపూట మ్యాచ్ జరగడం వల్ల మ్యాచ్‌లో మంచు పాత్ర ఉండదు.అంటే ఆదివారం జరిగే మ్యాచ్ ను ఫ్యాన్ ఎంజాయ్ చేస్తూ చూడవచ్చన్నమాట. 

పరుగుల సునామీ

జోహన్నెస్‌బర్గ్‌లోని 'ది వాండరర్స్' స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ గ్రౌండ్ అధిక స్కోరింగ్ గ్రౌండ్. ఇక్కడ మూడుసార్లు 400+ స్కోర్‌లు చేయబడ్డాయి. 300 పరుగుల మార్క్ చాలాసార్లు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో భారీ స్కోరు ఉంటుందని అంచనా.

జోహన్నెస్‌బర్గ్‌లో భారత్‌ రికార్డు

జోహన్నెస్‌బర్గ్ వన్డేలో టీమిండియా రికార్డు పేలవంగా ఉంది. ఇక్కడ భారత జట్టు 8 మ్యాచ్‌లు ఆడగా, 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. అయితే ఈ మైదానంలో దక్షిణాఫ్రికా 40 మ్యాచ్‌లు ఆడగా 30 మ్యాచ్‌లు గెలిచింది. ఈ మైదానంలో అతిథ్య జట్టు ఘనమైన రికార్డు ఉండటం టీమిండియాను కాస్త కలవరపెడుతోంది

 వన్డే సిరీస్ కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇవే

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, wk), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (WK), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఆకాష్ దీప్.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్‌మన్, నాండ్రే బెర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మిహలాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రైజ్ షమ్సీ వెర్నీవాన్, రస్సీ వెర్నీవాన్‌సి, లిజాడ్ విలియమ్స్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios