రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ నిర్వహణ తీరుపై అనుమానాలు...ఇండియా లెజెండ్స్ తరుపున ఆడిన ముగ్గురికి కరోనా పాజిటివ్...సచిన్ టెండూల్కర్, యూసఫ్ పఠాన్... ఇప్పుడు బద్రీనాథ్...

భారత మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్‌కి కరోనా సోకింది. బద్రీనాథ్‌తో కలిపి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ జట్టు తరుపున ఆడిన ప్లేయర్లలో ముగ్గురికి కరోనా సోకినట్టు తేలింది. ఇండియా లెజెండ్స్ జట్టుకి సారథిగా వ్యవహారించిన సచిన్ టెండూల్కర్‌కి కరోనా సోకగా ఆ తర్వాత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌కి కూడా పాజిటివ్ వచ్చింది.

ఇప్పుడు బద్రీనాథ్‌కి కూడా కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన ప్లేయర్లు కూడా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. రాయిపూర్‌లో జరిగిన ఈ సిరీస్‌కి ప్రేక్షకులను కూడా అనుమతించారు.

Scroll to load tweet…

ఇండియా లెజెండ్స్ తరుపున యువరాజ్ సింగ్‌, సెహ్వాగ్, కైఫ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్లేయర్లు ఆడిన విషయం తెలిసిందే... టీమిండియా తరుపున 7 వన్డేల్లో 79 పరుగులు చేసిన బద్రీనాథ్, 2 టెస్టుల్లో 63 పరుగులు చేశాడు. 145 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 10245 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.