Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సొంచరీ.. T20లో 52 బంతుల్లోనే తొలి శతకం
రుతురాజ్ గైక్వాడ్ ఈ రోజు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20లో తన సత్తా చూపించాడు. 52 డెలివరీల్లోనే 123 పరుగులు సాధించాడు. 13 ఫోర్లు, ఏడు సిక్స్‌లతో చెలరేగిపోయాడు.
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ల జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మూడో టీ20 ఈ రోజు గువహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్నది. తొలిగా బ్యాటింగ్ చేసిన భారత్ కంగారూల ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. తొలుత వెంట వెంటనే వికెట్లు పడిపోగా పిచ్‌లో బలంగా నిలబడిన రుతురాజ్ గైక్వాడ్ అంతే అద్భుతమైన సెంచరీ సాధించారు.
అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి శతకాన్నే మెరుపు సెంచరీగా నమోదు చేసుకున్నారు. ఓవర్లు కావొస్తున్నాకొద్దీ ఆయన దూకుడు పెంచుకుంటూ పోయారు. చివరి ఓవర్‌లో తన సెంచరీ పూర్తి చేసుకున్నారు. చివరి ఓవర్‌లో 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో టీమిండియా జట్టుకు పరుగులను జోడించిన ఈ బ్యాట్స్‌మెన్ మరో 20 బంతుల్లో సెంచరీ మైలురాయి దాటేశాడు. మొత్తం 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్ మరో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టాడు. దీంతో చివరి ఓవర్‌లోనే 30 పరుగులు సాధించారు. మొత్తం 57 బంతుల్లో 13 బౌండరీలు, 7 సిక్స్‌లతో 123 రన్స్ కొట్టి టీమిండియాకు ఢోకాలేని స్థాయిలో పరుగులను అందించారు.
రుతురాజ్ గైక్వాడ్ అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా కేవలం మూడు వికెట్ల నష్టంతో 222 పరుగులను సాధించింది.
Also Read: IND vs AUS T20: ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న యశస్వి జైస్వాల్ 'సారీ' ఎందుకు చెప్పాడు..?
నిన్నటి వరకు రుతురాజ్ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో లేదా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక స్కోరు కేవలం 71 పరుగులు మాత్రమే. నేడు అది 123కు చేరింది. ఈ రోజు ఆయన అంతర్జాతీయ మ్యాచ్‌లో తన తొలి శతకాన్ని రికార్డు చేసుకున్నారు. దీంతో మొత్తంగా ఆయన కెరీర్‌లో ఇది ఐదో సెంచరీ. ఐపీఎల్‌లో ఆయన 2021 సీజన్‌లో సెంచరీ చేశారు. మహారాష్ట్రలో 20 ఓవర్ల డొమెస్టిక్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో మూడు సెంచరీలు చేశారు. మొత్తంగా ఐదు సెంచరీలు కొట్టినా.. ఇందులో అంతర్జాతీయ మ్యాచ్‌లో సాధించింది ఈ రోజే.
మరో రికార్డును కూడా రుతురాజ్ గైక్వాడ్ ఈ రోజు సొంతం చేసుకున్నారు. టీ20 ఇంటర్నేషనల్‌లో ఓపెనర్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో చేరిపోయాడు. ఇది వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లు ఉన్నారు. అందులో ఐదో ప్లేయర్‌గా రుతురాజ్ గైక్వాడ్ కూడా చేరిపోయారు.