Asianet News TeluguAsianet News Telugu

స్కోర్ బోర్డు చూసి గుండె ఆగినంత పనైంది, కొట్టేశానంతే: రస్సెల్

శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోవాల్సింది రస్సెల్ వీరవిహారంతో గెలిచింది. చివరలో 13 బంతుల్లో  48 పరుగులు చేసి కోహ్లీ సేనకు అపజయాన్ని అందించాడు.ఈ విషయంపై రస్సెల్ మాట్లాడాడు.

Russel talks on his innings aginst RCB
Author
Bangalore, First Published Apr 6, 2019, 6:42 PM IST

బెంగళూరు: తాను క్రీజులోకి వచ్చినప్పుడు పిచ్ ను బట్టి ఆడాలని కెప్టెన్ దినేష్ కార్తిక్ సలహా ఇ్చచాడని, అయితే ఎదురుగా కనిపిస్తున్న స్కోరు బోర్డు చూసేసరికి గుండె ఆగినంత పనైపోయిందని కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్య్రూ రస్సెల్ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై మ్యాచ్‌ను రస్సెల్ ఒంటి చేతితో గెలిపించిన విషయం తెలిసిందే. 

శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోవాల్సింది రస్సెల్ వీరవిహారంతో గెలిచింది. చివరలో 13 బంతుల్లో  48 పరుగులు చేసి కోహ్లీ సేనకు అపజయాన్ని అందించాడు.
 
ఈ విషయంపై రస్సెల్ మాట్లాడాడు. తాను క్రీజులోకి వచ్చినప్పుడు 20 బంతుల్లో 68 పరుగులు చేయాలని తెలిసి ఇటువంటి రోజు మరెప్పుడూ తనకు ఎదురుకాకూడదని అనుకున్నానని చెప్పాడు. అయితే, ఆ తర్వాత ఏకాగ్రత పెంచుకుని కొట్టేశానని, నిజానికి ఎలా కొట్టానో కూడా తనకు తెలియదని అన్నాడు. 

జట్టులోని ఆటగాళ్లందరూ తనను ప్రోత్సహిస్తారని రస్సెల్ చెప్పాడు నచ్చిన విధంగా ఆడే స్వేచ్ఛను దినేశ్ ఇచ్చాడని అన్నాడు. సహచరుల ప్రోత్సాహం వల్లే తాను ఈ విధంగా ఆడగలుగుతున్నట్లు తెలిపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios