47 పరుగులతో ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్...మరోసారి విఫలమైన కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్... మోర్గాన్ మెరుపులు...2 వికెట్లు తీసిన జోఫ్రా ఆర్చర్..

IPL 2020లో భాగంగా టాస్ గెలిచి, కోల్‌కత్తా జట్టును బ్యాటింగ్‌కి ఆహ్వానించిన రాజస్థాన్ రాయల్స్... ప్రత్యర్థిని మంచి స్కోరుకే నియంత్రించగలిగింది. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. కేకేఆర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సునీల్ నరైన్ 15 పరుగులు, నితీశ్ రాణా 22 పరుగులు, ఆండ్రే రస్సెల్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దినేశ్ కార్తీక్ మరోసారి విఫలమయ్యాడు. 3 బంతులు ఆడి 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు కార్తీక్. 115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమ్మిన్స్, ఇయాన్ మోర్గాన్ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 10 బంతుల్లో 12 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్ అవుట్ కాగా... ఇయాన్ మోర్గాన్ ఆఖర్లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కమ్లేశ్ 8 పరుగులు చేయగా, మోర్గాన్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.