ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టుల కోసం ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... 14 రోజుల క్వారంటైన్ ముగించుకుని భారత జట్టుతో కలిశాడు. సిడ్నీలో క్వారంటైన్‌లో గడిపిన రోహిత్ శర్మ, మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారత జట్టును కలుసుకున్నాడు.

సిడ్నీలో మూడో టెస్టు ఆడబోతున్న టీమిండియా... అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో జనవరి 4 వరకూ మెల్‌బోర్న్‌లోనే ప్రాక్టీస్ చేయనుంది. ‘ఆస్ట్రేలియాలో రెండు టెస్టులు ఆడడమే ఇప్పుడు నా కల. నేను రాణిస్తానో లేదో తెలీదు.

ఒక వేళ ఫెయిల్ అయినా నా దేశం కోసం ఆడాలనే నా కలను నెరవేర్చుకుంటాను.. అదే అత్యంత ముఖ్యమైన విషయం’ అని చెప్పాడు రోహిత్ శర్మ. మెల్‌బోర్న్‌లో భారత జట్టును రోహిత్ శర్మ కలిసిన వీడియోను పోస్టు చేసింది బీసీసీఐ.