Asianet News TeluguAsianet News Telugu

Rohit Sharma: హిట్‌మ్యాన్ అరుదైన ఘనత.. టీ20లలో మొదటి ఆటగాడిగా రికార్డు

Asia Cup 2022: టీమిండియా సారథి రోహిత్ శర్మ టీ20లలో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్ తో మ్యాచ్ లో  హిట్‌మ్యాన్ ఈ రికార్డు సృష్టించాడు. 
 

Rohit Sharma Registers Mega Achievement in T20I Cricket, Becomes First Batter Ever to Score 3500 in Shortest Format
Author
First Published Aug 31, 2022, 9:55 PM IST

భారత జట్టు సారథి రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. వేగంగా పరుగులు  సాధించే టీ20లలో అతడు..  అంతే వేగంగా 3,500 పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. ఆసియా కప్ - 2022లో భాగంగా  హాంకాంగ్ తో మ్యాచ్ ఆడుతూ  అతడు ఈ ఘనతను అందుకున్నాడు. టీ20లలో 3 వేల పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా గుర్తింపుపొందిన రోహిత్ శర్మ తాజాగా 3,500 పరుగుల మార్కును అందుకున్న మొదటి ఆటగాడిగా రికార్డు పుటల్లో చోటు దక్కించుకున్నాడు. 

హాంకాంగ్ తో మ్యాచ్ లో రోహిత్.. 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో  రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కూడా ఉంది. ఈ మ్యాచ్ లో  13 పరుగులు చేయగానే రోహిత్ అంతర్జాతీయ టీ20లలో 3,500 పరుగుల మార్కును అందుకున్న తొలి బ్యాటర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. 

రోహిత్ శర్మ 134 టీ20 మ్యాచులలో ఈ ఘనతను అందుకున్నాడు. 126 ఇన్నింగ్స్ లలో రోహిత్.. 32.18 సగటుతో మొత్తంగా 3,508 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ క్రమంలో రోహిత్ 17 సార్లు నాటౌట్ గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్ లో రోహిత్.. 313 బౌండరీలు, 165 సిక్సర్లు బాదాడు. 

 

రోహిత్ తర్వాత ఈ జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్.. 3,497 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. గప్తిల్.. 121 మ్యాచులు (117 ఇన్నింగ్స్) లో 3,497 పరుగులు చేశాడు. గప్తిల్ టీ20 కెరీర్ లో 2 సెంచరీలు 20 హాఫ్  సెంచరీలున్నాయి. ఈ ఇద్దరి తర్వాత మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ.. 101 మ్యాచుల (92 ఇన్నింగ్స్)లో 3,343 పరుగులు చేశాడు. టీ20లలో కోహ్లీ సెంచరీ చేయకపోయినా 31 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత జాబితాలో ఐర్లాండ్ కు చెందిన పి. స్టిర్లింగ్ (114 మ్యాచులలో 3,011), ఆరోన్ ఫించ్ (92 మ్యాచులలో 2,855) ఉన్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios