టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ కి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ శివార్లలో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ స్టేడియానికి శుక్రవారం శంకుస్థాపన  చేశారు. ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ, అతడి భార్య రితిక కూడా ఇందులో పాల్గొన్నారు.

ఆశ్రమానికి ఉదయం 8గంటలకు చేరుకున్న రోహిత్ అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం స్టేడియం నిర్మించనున్న స్థలాన్ని సందర్శించారు.  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మిషన్ మార్గ దర్శకుడు కమలేష్ పటేల్ మాట్లాడారు.

రోహిత్ శర్మ  యువతకు స్ఫూర్తిదాయకమని... అందుకే  స్టేడియానికి అతని పేరు పెడుతున్నామని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమౌతాయని చెప్పారు. దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే లక్ష్యంతో స్డేడియం, శిక్షణ కేంద్రం నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పారు. ఆశ్రమ అభ్యాసీలతో పాటు ప్రతిభావంతులందరికీ ఈ స్టేడియం అందుబాటులో ఉంటుందన్నారు.

అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. రామచంద్ర మిషన్ కు తన సహచర క్రికెటర్లను తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.