పేటీఎం టీ20 సిరీస్ ట్రోఫీని టీమిండియా మేనేజర్ జయ్‌దేవ్ షా చేతికి అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ...
శ్రీలంకను మూడో టీ20లో చిత్తు చేసి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. అంతకుముందు న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను వైట్ వాష్ చేసిన రోహిత్ టీమ్‌కి ఇది వరుసగా నాలుగో క్లీన్ స్వీప్...
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచే సిరీస్‌లో ఆరంగ్రేటం చేసిన ప్లేయర్‌కి ట్రోఫీని అందించడం ఆనవాయితీగా వస్తోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హర్షల్ పటేల్, ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్‌లో రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్... ఆరంగ్రేటం చేసి కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి టైటిల్స్‌ను అందుకున్నారు...
అయితే శ్రీలంకతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ట్రోఫీ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, ఓ ప్లేయర్ కాని వ్యక్తికి దాన్ని అందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రోహిత్ శర్మ నుంచి ట్రోఫీ అందుకున్న అతను ఎవరు? మ్యాచ్ చూసిన అందరినీ వెంటాడిన ప్రశ్న ఇదే...
రోహిత్ శర్మ ట్రోఫీ అందించిన వ్యక్తి, టీమిండియా కొత్త మేనేజర్ జయ్‌దేవ్ షా. జయ్‌దేవ్ షా, రంజీల్లో సౌరాష్ట్ర మాజీ కెప్టెన్. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. భారత క్రికెట్ బోర్డులో మాజీ సెక్రటరీ నిరంజన్ షా కొడుకైన జయ్‌దేవ్ షా... 2007-08 సీజన్‌లో సౌరాష్ట్రకు విజయ్ హాజారే ట్రోఫీ అందించాడు...
సౌరాష్ట్రకు ఇదే మొట్టమొదటి దేశవాళీ కాగా 2008లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన జయ్‌దేవ్ షా, ఆ తర్వాత గుజరాత్ లయన్స్ జట్టు తరుపున కూడా ఆడాడు...
2018 రంజీ ట్రోఫీ తర్వాత క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన జయ్‌దేవ్ షా, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 120 మ్యాచులు ఆడి 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలతో 5354 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 10 వికెట్లు తీశాడు.
54 లిస్టు ఏ మ్యాచులు ఆడి 2 సెంచరీలతో 1118 పరుగులు చేశాడు. 33 టీ20 మ్యాచుల్లో 523 పరుగులు చేసిన జయ్‌దేవ్ షా, తన ఆఖరి క్రికెట్ మ్యాచ్‌లో 97 పరుగులు చేశాడు...
భారత జట్టులో ఆవేశ్ ఖాన్, రవి భిష్ణోయ్ వంటి ప్లేయర్లు అప్పటికే ట్రోఫీ లిప్ట్ చేయడంతో టీమ్ వైపు వెళ్తున్న జయ్‌దేవ్ షాను చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ, వెంటనే అతనికి ట్రోఫీ అందించాడు... ప్లేయర్‌గా టీమిండియాకి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయినప్పటికీ రోహిత్ శర్మ కారణంగా ట్రోఫీని ఎత్తే అవకాశం జయ్‌దేవ్‌కి దక్కింది...
స్వదేశంలో కెప్టెన్‌గా 17 టీ20 మ్యాచుల్లో 16 విజయాలు అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి కెప్టెన్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. టెస్టు కెప్టెన్‌గానూ నియమించబడిన రోహిత్ శర్మ, మార్చి 4 నుంచి శ్రీలంకతో ఆరంభమయ్యే మొహాలీ టెస్టు నుంచి రెడ్ బాల్ కెప్టెన్సీ కెరీర్‌ను మొదలెట్టబోతున్నాడు...
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి మొహాలీ టెస్టు 100వ టెస్టు. పంజాబ్‌లో కరోనా కేసుల కారణంగా మొహాలీ టెస్టును ప్రేక్షకులు లేకుండి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ).
