విరాట్ కోహ్లీని డకౌట్ చేసిన బెన్ స్టోక్స్, హాఫ్ సెంచరీ చేరువైన రోహిత్ శర్మను కూడా పెవిలియన్ చేర్చాడు. 144 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు ముందు అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ.

121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా. అజింకా రహానే 45 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఇంకా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 84 పరుగులు వెనకబడి ఉన్న టీమిండియా, మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కించుకోవాలంటే పంత్, అశ్విన్ మధ్య ఓ భారీ భాగస్వామ్యం రావాల్సిందే.