Asianet News TeluguAsianet News Telugu

అందుకోసమే హాఫ్ సెంచరీ... తనకే అంకితం: రోహిత్

ఐపిఎల్ 2019 చివరి లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఓవైపు కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలపై నీళ్లు చల్లుతూనే మరోవైపు  చెన్నై, డిల్లీలను వెనక్కినెట్టి పాయింట్స్ టేబుల్ లో టాప్ కు చేరుకుంది. ఇలా సొంతగడ్డపై భారీ విజయాన్ని అందుకోవడంలో ముంబై కెప్టెన్  రోహిత్ శర్మ ముఖ్య  పాత్ర పోషించాడు. లక్ష్యచేధనలో హాఫ్ సెంచరీతో అదరగొడుతూ మ్యాచ్  చివరివరకు నిలిచి ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఇలా తాను హాఫ్ సెంచరీతో అదరగొట్టడానికి తన గారాలపట్టి మైదానంలోనే  వుండటమే కారణమని రోహిత్ వెల్లడించాడు.     

Rohit Sharma Dedicates His half century to Daughter
Author
Mumbai, First Published May 6, 2019, 3:11 PM IST

 ఐపిఎల్ 2019 చివరి లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఓవైపు కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలపై నీళ్లు చల్లుతూనే మరోవైపు  చెన్నై, డిల్లీలను వెనక్కినెట్టి పాయింట్స్ టేబుల్ లో టాప్ కు చేరుకుంది. ఇలా సొంతగడ్డపై భారీ విజయాన్ని అందుకోవడంలో ముంబై కెప్టెన్  రోహిత్ శర్మ ముఖ్య  పాత్ర పోషించాడు. లక్ష్యచేధనలో హాఫ్ సెంచరీతో అదరగొడుతూ మ్యాచ్  చివరివరకు నిలిచి ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఇలా తాను హాఫ్ సెంచరీతో అదరగొట్టడానికి తన గారాలపట్టి మైదానంలోనే  వుండటమే కారణమని రోహిత్ వెల్లడించాడు.  

కెకెఆర్  పై విజయం అనంతరం  రోహిత్ తన భార్యా, కూతురితో మైదానంలో సందడి చేశాడు. కూతురిని  ఎత్తుకుని తిరుగతూ, ఆడిస్తూ తెగ  సంబరసపడుతూ కనిపించాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ..ముంబై  లో జరిగిన  ప్రతి మ్యాచ్ కు  తన భార్యా, కూతురు హాజరయ్యారవుతూ వస్తున్నారని  తెలిపాడు. అయితే  తాను మాత్రం వారిని తన ఆటతీరుతో ఆకట్టుకోలేకపోయానని తెలిపాడు. కాబట్టి  చివరి మ్యాచ్ లో కోల్‌కతా  నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై విజయం కోసం ఆడుతూ తన కుటుంబాన్ని కూడా అలరించే అవకాశం  వచ్చిందని రోహిత్  వెల్లడించాడు. 

అయితే మ్యాచ్ ఆరంభంలో డికాక్ దాటిగా  ఆడుతుండటంతో తాను కేవలం స్టైక్ రొటేట్ చేయడానికే  పరిమితమయ్యాయని అన్నారు. అతడు  ఔటైన తర్వాత కాస్త  వేగాన్ని పెంచి హాఫ్ సెంచరీని సాధించానని...అయితే ఈ  సమయంలో తన కూతురు సమైరా పడుకుని  వుందన్నాడు. తనను అలరించడానికి సాధించిన అర్థశతకాన్ని తాను చూడలేకపోయింది కాబట్టి దీన్ని ఆమెకే అంకితమిస్తున్నట్లు  రోహిత్  వెల్లడించాడు. 

ఆదివారం జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేయగలిగింది. క్రిస్‌ లిన్‌ (29 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 41 పరుగులు) ధాటిగా ఆడాడు. రాబిన్‌ ఉతప్ప (47 బంతుల్లో 3 సిక్స్ ల సాయంతో 40 పరుగులు) చేశాడు.  ముంబై ఇండియన్స్ బౌలర్లలో మలింగ 3 వికెట్ల తీయగా, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై 16.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్‌; 8 ఫోర్లు), సూర్య కుమార్‌ (27 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్‌కు అభేద్యంగా 60 బంతుల్లోనే 88 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios