రెండో ఇన్నింగ్స్‌లో టిమ్ పైన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సరదా సంఘటన...టిమ్ పైన్‌పై సెడ్జింగ్ చేస్తూ ‘స్పైడర్ మ్యాన్’ పాట పాడిన రిషబ్ పంత్...సోషల్ మీడియాలో వీడియో వైరల్...

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్, భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య ఉన్న అనుబంధం చాలా స్పెషల్. గత ఆసీస్ పర్యటనలో వికెట్ల వెనకాల సెడ్జింగ్ చేస్తూ, ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించాడు రిషబ్ పంత్. ‘టెంపరరీ కెప్టెన్’ అంటూ టిమ్ పైన్‌ను ఆట పట్టిస్తూ ‘బేబీ సిట్టర్’గా ఆసీస్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు.

తాజాగా మరోసారి టిమ్ పైన్‌ను తన స్టైల్‌లో టీజ్ చేశాడు రిషబ్ పంత్. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో టిమ్ పైన్, రిషబ్ పంత్ మధ్య సరదా సంభాషణ సాగింది. దానికి టిమ్ పైన్... ‘కనీసం నా జట్టు సభ్యులంతా నన్ను ఇష్టపడతారు... బిగ్ హెడ్’ అంటూ కామెంట్ చేశాడు.

దానికి రిషబ్ పంత్... ‘స్పైడర్ మ్యాన్... స్పైడర్ మ్యాన్... తూనే చురాయ మేరా దిల్ కా చైయిన్... ఫిస్... ఫిస్’ అంటూ పాట అందుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Scroll to load tweet…

మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన టిమ్ పైన్, రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసి శార్దూల్ బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.