20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ రిషబ్ పంత్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఆడిన రివర్స్ స్కూప్ షాట్ సిక్సర్‌, క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

అప్పటికే కెఎల్ రాహుల్ వికెట్ తీసిన ఆర్చర్ బౌలింగ్‌లో అద్భుతమైన స్కూప్ షాట్ ఆడిన పంత్, ఆ తర్వాతి బంతిని బౌండరీకి తరలించాడు. పంత్ ఆడిన రివర్స్ స్కూప్ షాట్‌ చూసి, బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆశ్చర్యంతో నోరు తేలేశారు. అలాగే భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా ఇలాగే షాట్‌నే ఆడాడు.

అప్పర్ కట్‌తో అద్భుతమైన బౌండరీ సాధించాడు. రిషబ్ పంత్ 23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి అవుట్ కాగా హార్ధిక్ పాండ్యా 21 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 19 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

 

ఈ ఇద్దరూ మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే, భారత జట్టుకి భారీ స్కోరు దక్కి ఉండేదే. ముఖ్యంగా మొన్న అండర్సన్ బౌలింగ్‌లో, నిన్న ఆర్చర్ బౌలింగ్‌లో స్కూప్ షాట్ ఆడిన రిషబ్ పంత్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.