ఐపీఎల్ 2021 సీజన్‌కి రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్...స్టీవ్ స్మిత్, అజింకా రహానే, పృథ్వీషా, అశ్విన్‌లకు నిరాశ...
శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. 2021 సీజన్‌కి కొత్త కెప్టెన్ ఎవరు? అనే సస్పెన్స్‌కి తెర తీసింది ఢిల్లీ క్యాపిటల్స్. జట్టులో సీనియర్ కెప్టెన్లు నలుగురు ఉన్నప్పటికీ, సారథిగా ఏ మాత్రం అనుభవం లేని రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ఢీసీ...
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, టీమిండియాకి తాత్కాలిక టెస్టు సారథిగా వ్యవహారించిన అజింకా రహానే, పంజాబ్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన అనుభవం ఉన్న రవిచంద్రన్ అశ్విన్, అండర్ 19 కెప్టెన్‌గా, ముంబై కెప్టెన్‌గా వ్యవహారించిన పృథ్వీషాలను పక్కనబెట్టి... యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...
ఇషాన్ కిషన్ సారథ్యంలో అండర్ 19 వరల్డ్‌కప్ ఆడిన రిషబ్ పంత్, ఇప్పుడు అతను ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉంటే, ఈ యంగ్ వికెట్ కీపర్ మాత్రం ఓ జట్టుకే కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు.
