101 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్...ఏడో వికెట్‌కి సుందర్‌తో కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రిషబ్ పంత్...టెస్టుల్లో మూడో సెంచరీ బాదిన రిషబ్ పంత్, స్వదేశంలో తొలి సెంచరీ...

ఆరు టెస్టులుగా సెంచరీ మార్కు కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎట్టకేలకు శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రిషబ్ పంత్ ఊర మాస్ బ్యాటింగ్‌తో టెస్టు కాస్తా టీ20గా మారిపోయింది... హాఫ్ సెంచరీకి ముందు 61గా ఉన్న రిషబ్ పంత్ యావరేజ్, అర్ధశతకం తర్వాత 130కి పైగా దూసుకెళ్లింది.

బౌలర్ ఎవరైనా పట్టించుకోకుండా బౌండరీకి తరలించడమే టార్గెట్‌గా బ్యాటింగ్ చేశాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌తో పాటు భారత టాప్ ఆర్డర్ పరుగులు చేయడానికి తెగ ఆపసోపాలు పడిన పిచ్‌పైన బౌండరీల మోత మోగించారు వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్...

అండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడిన రిషబ్ పంత్, సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు. 2021ఏడాదిలో 500 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్, జో రూట్ మాత్రమే ఈ ఏడాది రిషబ్ పంత్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్న రిషబ్ పంత్, టెస్టుల్లో స్వదేశంలో తొలి సెంచరీ అందుకున్నాడు. 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసిన రిషబ్ పంత్, అండర్సన్ బౌలింగ్‌లో జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 259 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా...