డీన్ జోన్స్... ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్!! డీ హైడ్రేషన్‌తో బాధపడుతూ కూడా, కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడం కోసం డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్. అంతేనా కోచ్‌గా వ్యవహారిస్తూ కూడా,  ఎంతో నిరాడబరంగా వ్యవహారించిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనషి.  స్టేడియంలో ప్రేక్షకులు పడేసిన చెత్తను డీన్ జోన్స్ ఏరి, చెత్తబుట్టలో వేసిన వీడియో.. అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. ప్రస్తుతం పీఎస్ఎల్‌లో కరాచీ కింగ్స్ జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న డీన్ జోన్స్... ఓ మ్యాచ్ అనంతరం స్టేడియంలో ప్రేక్షకులు కుప్పలుతెప్పలు పడేసిన చెత్తను ఎత్తిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

ఈ వీడియోను పోస్టు చేస్తున్న పాక్ దేశస్థులు, డీన్ జోన్స్‌తో పీఎస్‌ఎల్ క్రికెట్‌కి ఉన్న అనుబంధం గురించి చర్చిస్తున్నారు. డీన్ జోన్స్ క్రికెట్ ఎంట్రీ కూడా గమ్మత్తుగా జరిగింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రహమ్ ఎల్లోప్‌కి గాయం కావడంతో అతని స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు డీన్ జోన్స్. అయితే అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. మ్యాచ్ మొదలయ్యే సమయానికి మాజీ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అనారోగ్యంతో బాధపడడంతో ఆ ప్లేస్‌లో డీన్ జోన్స్ జట్టులోకి వచ్చాడు. డీన్ జోన్స్ కూడా డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నా, జట్టు కోసం దాన్ని లెక్కచేయకుండా బరిలో దిగాడు. 48 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మరోసారి తీవ్రజ్వరంలో బాధపడుతూనే బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ బాదాడు డీన్ జోన్స్. 

డీన్ జోన్స్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్ వీడియో ఇదే.