కరోనా మహమ్మారి దేశంలో ఇంకా తన బీభత్సాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా.. ఇండియన్ క్రికెటర్ రాహుల్ శర్మ తండ్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రాహుల్.. స్వయంగా ట్విట్టర్ లో తెలియజేశాడు.

ఈ స్పిన్నర్.. 2006 లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రాహుల్ శర్మ ని ఐపీఎల్ లో  డెక్కన్ చార్జెస్ జట్టు 2010లో దక్కించుకుంది. 2012లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ లో మెరిశాడు. చెన్నై సూపర్ కింగ్స్ లోనూ కొంతకాలం భాగమయ్యాడు. కాగా.. తాజాగా.. తన తండ్రిని కోల్పోయినట్లు రాహుల్ పేర్కొన్నారు.

 

‘‘ నువ్వు లేకుండా నా జీవితం ఎప్పటిలాగే ఉండదు నాన్న. నేను నా జీవితంలో ప్రతి ఒక్క విషయం నీ నుంచే నేర్చుకున్నారు. పోరాడే శక్తి, విల్ పవర్, హార్డ్ వర్క్ డెడికేషన్.. ఇలా ప్రతి ఒక్కటీ నేను నీ నుంచే నేర్చుకున్నాను. ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు.

తాను టీమిండియా కోసం ఆడటం తన తండ్రి కల అని.. దానిని తాను నెరవేరుస్తానంటూ ఆయన మరో ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా.. ఆయన ట్వీట్ కి ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. రాహుల్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్లు చేస్తున్నారు. రాహుల్ కి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా.. యువ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా కూడా స్పందించాడు. ‘ ఈ విషయం వినడానికి చాలా బాధగా అనిపించిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.

రాహుల్.. అరంగేట్రం చేసిన సమయంలో తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే.. అనూహ్యంగా ఓ ఘటన అతని జీవితాన్ని తలకిందులు చేసింది. 

రాహుల్,  దక్షిణాఫ్రికా క్రికెటర్  వేన్ పార్నెల్ ను 2012 లో డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెటర్లు ఇద్దరూ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఈ ఘటన అతని కెరిర్ పై బాగానే పడిందని చెప్పాలి. అయితే అనూహ్యంగా 2013లో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇతనిని కొనుగోలు చేసింది కానీ..  అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం పొందలేదు.