Asianet News TeluguAsianet News Telugu

‘రాసిపెట్టుకోండి.. రాబోయే రోజుల్లో టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తోపు అతడే..’

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే  అసోం కుర్రాడు రియాన్ పరాగ్ పై  ఆ జట్టు పీల్డింగ్ కోచ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  అయితే ఇంతవరకూ ఈ  యువ ఆల్ రౌండర్ జాతీయ జట్టుకు అరంగేట్రమే చేయలేదు. 
 

Remember My Words, He Will  be Next Big Thing in Team India: RR Fielding Coach  Lauds Riyan parag
Author
First Published Dec 14, 2022, 4:09 PM IST

టీమిండియాకు ఆల్ రౌండర్ల కొరత ఉంది. చాలాకాలంగా వేధిస్తున్న ఈ సమస్యను తీర్చడానికి మేమున్నామంటూ పలువురు ఆటగాళ్లు వస్తున్నా వాళ్లంతా  ఒకట్రెండు సిరీస్ లకే పరిమితమవుతున్నారు. వరుసగా విఫలమై  తర్వాత కంటికి కనిపించకుండా పోతున్నారు. హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తర్వాత భారత జట్టుకు  ఇప్పటికీ నిఖార్సైన ఆల్ రౌండర్ లేడంటే అతిశయోక్తి కాదు.  కానీ  ఆ లోటును  అసోం కుర్రాడు రియాన్ పరాగ్ తీరుస్తాడంటున్నాడు  ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న దిశాంత్ యగ్నిక్. తాజాగా అతడు తన ట్విటర్ ద్వారా రియాన్ పరాగ్ పై ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు.  

యగ్నిక్ తన ట్వీట్ లో.. ‘నేను  చెబుతున్నది రాసిపెట్టుకోండి. రాబోయే రోజుల్లో టీ20 ఫార్మాట్ లో భారత జట్టుకు  రియాన్ పరాగ్ కీలక ఆటగాడు అవుతాడు..’ అని ట్వీట్ చేశాడు. ఐపీఎల్ లో పరాగ్.. రాజస్తాన్ రాయల్స్ తరఫున  2019 నుంచి ఆడుతున్నాడు. 

గత సీజన్ లో పరాగ్.. రాజస్తాన్ ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ భాగమయ్యాడు.  17 మ్యాచ్ లు ఆడి  138 స్ట్రైక్ రేట్ తో 183 రన్స్ చేశాడు. మొత్తంగా 2019 నుంచి ఇప్పటివరకు 47 మ్యాచ్ లు ఆడి 522 పరుగులు చేశాడు.  

 

అసోంకు చెందిన ఈ కుర్రాడు ఇప్పుడిప్పుడే  వెలుగులోకి వస్తున్నాడు. ఇటీవలే ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో  అసోం తరఫున  9 మ్యాచ్ లు ఆడిన పరాగ్.. 552 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్  సెంచరీ కూడా ఉంది. పరాగ్ సూపర్ బ్యాటింగ్ తో  ఈ ట్రోఫీలో అసోం సెమీస్ వరకు చేరగలిగింది.  
ఇక దేశవాళీలో  లిస్ట్ ఏ క్రికెట్ లో  38, 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు,  81 టీ20 మ్యాచ్ లు ఆడిన పరాగ్  నిలకడగా రాణిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా మెరుస్తున్నాడు. అయితే దేశవాళీలో మెరుస్తున్న పరాగ్  ఇప్పటివరకూ జాతీయ జట్టు నుంచి పిలుపురాలేదు. కనీసం సెలక్టర్లు  అతడి పేరును సెలక్షన్ ప్రాసెస్ లో పరిగణనలోకి  కూడా తీసుకోలేదు. 

 

 

ఆటతో పాటు యాటిట్యూడ్ కూడా  ఎక్కువగానే ఉండే పరాగ్.. ఐపీఎల్-2021, 2022లో  ఆటగాళ్లతో వాగ్వాదాలు, అభ్యంతరకర  పనులతో  వివాదాలు కొనితెచ్చుకున్నాడు.  దీంతో  యగ్నిక్ ట్వీట్ కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘అవునవును..  ఆ యాటిట్యూడ్ తగ్గించుకోకుంటే  ఎందుకూ పనికిరాకుండా పోతాడు..’ అని కామెంట్స్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios