Asianet News TeluguAsianet News Telugu

కోలుకున్న రిషబ్ పంత్...యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ట్వీట్ చేసిన వికెట్ కీపర్...

18 రోజుల తర్వాత తన ఆరోగ్యంపై ట్వీట్ చేసిన రిషబ్ పంత్... ఛాలెంజ్‌లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్.. 

Ready for all Challenges, Rishabh Pant tweets after Car accident
Author
First Published Jan 16, 2023, 6:54 PM IST

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. 18 రోజుల తర్వాత ట్విట్ చేశాడు. డిసెంబర్ 30న ఢిల్లీ- డెహ్రాడూన్ రహదారిలో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ దీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు...

‘నాకు వచ్చిన గుడ్ విషెస్‌కి, ఈ సపోర్ట్‌కి నేను ఎంతో కృతజ్ఞుడిని. నా సర్జరీ విజయవంతమైందని తెలియచేస్తున్నా. కోలుకోవడం మొదలెట్టా. ముందు వచ్చే ప్రతీ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నాకు అన్ని విధాల అండగా నిలిచిన బీసీసీఐ, జై సా, ప్రభుత్వ అధికారులకు థ్యాంక్యూ... ’ అంటూ ట్వీట్ చేశాడు రిషబ్ పంత్.. 

జనవరి 7న ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో రిషబ్ పంత్ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. అతను మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నాడని సమాచారం... ‘రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. డాక్టర్లు అతని రిహాబ్ ప్రాసెస్‌ని మొదలెట్టారు. త్వరలో అతను వాకర్ ద్వారా నడవబోతున్నాడు. కొన్నిరోజులు మళ్లీ తనకాళ్లపైన నిలబడతాడు. అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుంది...’ అంటూ తెలియచేశారు బీసీసీఐ అధికారి...

డిసెంబర్ 30న ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వేలో రిషబ్ పంత్ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. వేగంగా దూసుకెళ్తున్న రిషబ్ పంత్ కారు, అదుపు తప్పి డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కాగా, రిషబ్ పంత్ మోకాలికి, నుదిటి పైన, వీపు భాగంలో గాయాలయ్యాయి...

యాక్సిడెంట్ జరిగిన వెంటనే రిషబ్ పంత్‌ని ఢిల్లీలోని సాక్ష్యం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి మార్చారు. ఐదు రోజుల చికిత్స తర్వాత ఎయిర్ అంబులెన్స్ ద్వారా రిషబ్ పంత్‌ని ముంబైకి తీసుకొచ్చింది బీసీసీఐ...

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2023 సీజన్‌కి కూడా రిషబ్ పంత్ దూరమయినట్టు అధికారికంగా తేలిపోయింది. వచ్చే వన్డే వరల్డ్ కప్ 2023తో పాటు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి కూడా రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం అనుమానమేనని వార్తలు వస్తున్నాయి... గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్ దూరం కావడంతో అతని ప్లేస్‌లో కొత్త కెప్టెన్‌ని వెతికే బాధ్యత మేనేజ్‌మెంట్‌పై పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios