ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ముంబయి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 179 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా అలవోకగా ఛేదించింది. 

ఓపెనర్లుగా బరిలోకి దిగిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (101), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (72) రాయల్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరే లక్ష్యాన్ని చేధించి ఆర్సీబీ కి మరో విజయాన్ని అందించారు. కాగా... ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

కాగా.. ఆ హాఫ్ సెంచరీని తన ముద్దుల కుమార్తె వామికకు అంకితమిచ్చాడు. వామిక ఊయల వేడుక సందర్భంగా.. కోహ్లీ.. ఈ హాఫ్ సెంచరీని కూతురికి డెడికేట్ చేయడం విశేషం. అలా అతను డెడికేట్ చేసే వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కోహ్లీ.. 2017లో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఈ ఏడాది జనవరి 11వ తేదీన కూతురు జన్మించింది. పాపకు వామిక అనే పేరు ఖరారు చేశారు. ఇప్పటి వరకు పాప ముఖం కనిపించేలా ఫోటో మాత్రం బయటకు రాకుండా విరుష్క జోడి జాగ్రత్త పడటం గమనార్హం.