IPL 2020: టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫ్లాప్ షో కంటిన్యూ చేసినా... ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు ‘ఆర్‌సీబీ సేవియర్’ ఏబీ డివిల్లియర్స్ మరోసారి తనదైన ఇన్సింగ్స్ ఆడడంతో మంచి స్కోరు చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

ఆరోన్ ఫించ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేయగా, దేవ్‌దత్ పడిక్కల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం విశేషం. 11 బంతులాడి 3 సింగిల్స్ మాత్రమే తీసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఏబీ డివిల్లియర్స్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో శివమ్ దూబే కూడా బౌండరీల బాదడంతో మంచి స్కోరు చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.