Highest targets successfully chased this IPL
224 RR vs KXIP Sharjah
179 CSK vs KXIP Dubai
172 KXIP vs RCB Sharjah
RCB vs KXIP: గెలిచి, నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... కోహ్లీసేనకి మూడో ఓటమి...

IPL 2020 సీజన్ 13లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్‌లో ఆరు ఓటములు ఫేస్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గెలిచిన ఒకే ఒక్క మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైనే. మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
సీజన్‌లో మూడో అతిపెద్ద విజయం...
ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన ఏడో ప్లేయర్...
Hitting six off the last ball to win in IPL
Rohit Sharma v KKR 2009
Rohit Sharma v PWI 2011
J Franklin v KKR 2011
Rohit Sharma v DC 2012
Saurabh Tiwary v PWI 2012
Dwayne Bravo v KKR 2012
MS Dhoni v KXIP 2016
M Santner v RR 2019
N Pooran v RCB 2020 *
మూడింట్లో రెండు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన మూడు మ్యాచుల్లో రెండు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పైనే ఓడింది...
రెండు విజయాలు ఆర్‌సీబీపైనే..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి దక్కిన రెండు విజయాలు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైనే దక్కాయి...
సిక్సర్‌తో ముగించిన పూరన్..
ఆఖరి బంతికి సిక్సర్ బాది విజయాన్ని ముగించాడు నికోలస్ పూరన్...
గేల్ అవుట్...
గేల్ అవుట్... ఆఖరి బంతికి ఉత్కంఠ... గేల్ రనౌట్ కావడంతో విజయానికి ఆఖరి బంతికి సింగిల్ కావాలి...
రెండు బంతుల్లో 1 పరుగు...
2 బంతుల్లో విజయానికి 1 పరుగు కావాలి...
3 బంతుల్లో 1 పరుగు...
పంజాబ్ విజయానికి చివరి 3 బంతుల్లో సింగిల్ పరుగు కావాలి...
గేల్ కొట్టిన భారీ సిక్సర్ చూడండి...
గేల్ కొట్టిన భారీ సిక్సర్ చూడండి..
ఆఖరి ఓవర్‌లో 2 పరుగులు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 6 బంతుల్లో 2 పరుగులు కావాలి...
2 ఓవర్లలో 7 పరుగులు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 12 బంతుల్లో కేవలం 7 పరుగులు కావాలి. క్రీజులో కెఎల్ రాహుల్, క్రిస్ గేల్ ఉన్నారు.
గేల్ హాఫ్ సెంచరీ...
క్రిస్ గేల్ 36 బంతుల్లో 5 సిక్సర్లు, ఓ ఫోర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. సీజన్‌లో గేల్‌కి ఇదే మొదటి మ్యాచ్...
గేల్ సునామీ...
క్రిస్ గేల్ తీసుకోకుండా పంజాబ్ ఏం కోల్పోయిందో చేసి చూపిస్తున్నాడు యూనివర్సల్ బాస్... 17వ ఓవర్‌లో 2 వరుస సిక్సర్లు బాదాడు గేల్...
24 బంతుల్లో 26...
మ్యాచ్ దాదాపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌వైపు వెళ్లిపోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి చివరి 4 ఓవర్లలో 26 పరుగులు కావాలి...
30 బంతుల్లో 46 పరుగులు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 5 ఓవర్లలో 46 పరుగులు కావాలి...
గేల్ సిక్సర్...
సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న క్రిస్ గేల్, సుందర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు.
రాహుల్ ‘డబుల్’ సిక్సర్...
కెఎల్ రాహుల్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. 12 ఓవర్లలో వికెట్ కోల్పోయి 103 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. విజయానికి 48 బంతుల్లో 69 పరుగులు కావాలి...
10 ఓవర్లలో 84...
10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి చివరి 10 ఓవర్లలో 88 పరుగులు కావాలి...
8 ఏళ్ల తర్వాత మూడో స్థానంలో...
Chris Gayle Batting at No.3 or Below in IPL
vs RR (2010)
vs RR (2012)
vs RCB (2020)*
9 ఓవర్లలో 82...
9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 82 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...