ఏడు మ్యాచ్‌ల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ కిక్‌లో ఉండగానే బెంగళూరు సారథి కోహ్లీకి షాక్ ఇచ్చారు రిఫరీ.

ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడింది. ముంబై ఇండియన్స్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు జరిమానా విధించారు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానెకు సైతం స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా తప్పలేదు