Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ, డివిలియర్స్ భావోద్వేగం... ఆర్సిబి అభిమానులకు ట్విట్టర్ సందేశం (వీడియో)

ఐపిఎల్ సీజన్ 12లో అత్యంత చెత్త ఆటతీరుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులను నిరాశపర్చిన విషయం తెలిసిందే. అసలు గెలుపు బోణీ కోసమే ఈ జట్టు లీగ్ దశలో దాదాపు సగం మ్యాచుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కాస్త గాడిలో పడ్డా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా లీగ్ దశలో ఆర్సిబి 13 మ్యాచులాడి కేవలం నాలుగు విజయాలను మాత్రమే అందుకుని పాంయింట్స్ టేబులో చివరిస్థానంలో నిలిచింది. అలాగే మరో మ్యాచ్ ఆడాల్సివున్నా ఆ ఫలితంలో సంబంధం లేకుండానే ఐపిఎల్ నుండి నిష్క్రమించడానికి సిద్దమయ్యింది. 

rcb captain virat kohli, de villiers emotional video
Author
Bangalore, First Published May 4, 2019, 5:44 PM IST

ఐపిఎల్ సీజన్ 12లో అత్యంత చెత్త ఆటతీరుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులను నిరాశపర్చిన విషయం తెలిసిందే. అసలు గెలుపు బోణీ కోసమే ఈ జట్టు లీగ్ దశలో దాదాపు సగం మ్యాచుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కాస్త గాడిలో పడ్డా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా లీగ్ దశలో ఆర్సిబి 13 మ్యాచులాడి కేవలం నాలుగు విజయాలను మాత్రమే అందుకుని పాంయింట్స్ టేబులో చివరిస్థానంలో నిలిచింది. అలాగే మరో మ్యాచ్ ఆడాల్సివున్నా ఆ ఫలితంలో సంబంధం లేకుండానే ఐపిఎల్ నుండి నిష్క్రమించడానికి సిద్దమయ్యింది. 

భారీ అంచనాలతో ఐపిఎల్ 12 సీజన్ ప్రారంభించిన ఆర్సిబి ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యింది. దీంతో తీవ్ర నిరాశచెందిన అభిమానులకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్ లు ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఆర్సిబి ప్రదర్శన, అభిమానుల గురించి వారిద్దరు భావోద్వేగంతో స్పందించిన వీడియోను బెంగళూరు జట్టు యాజమాన్యం తమ అధికారికి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 

'' ఈ సీజన్ లో మరో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. ఆర్సిబి ప్రదర్శన మిమ్మల్సి (అభిమానులను) నిరాశపర్చిందని తెలుసు. మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు మన్నించండి. వచ్చే సీజన్లో తప్పకుండా మిమ్మల్సి అలరించడానికి ప్రయత్నిస్తాం. మా ప్రదర్శనతో సంబంధం లేకుండా ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు'' అని  కోహ్లీ అన్నాడు. 

డివిలియర్స్ మాట్లాడుతూ... రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను గుర్తుచేసుకున్నాడు. కేవలం ఐదు ఓవర్లపాటే ఈ మ్యాచ్ జరిగినా నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మ్యాచ్ అన్ని అన్నారు. మొత్తంగా ఎత్తు పల్లాలతో సాగిన ఆర్సిబి ప్రయాణం మిమ్మల్సి నొప్పించివుండొచ్చన్నారు. అందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. వచ్చే ఏడాది మంచి ఆతీరుతో మళ్ళీ మీ ముందుకు వస్తామని డివిలియర్స్ వెల్లడించాడు. 

ఆర్సిబి శనివారం రాత్రి ఈ సీజన్లో చివరి మ్యాచ్రు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా  వుంచుకోవాలని సన్ రైజర్స్, విజయంతో ఈ సీజన్ కు వీడ్కోలు పలకాలని ఆర్సిబి భావిస్తోంది. ఇలా ఇరు జట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  

Follow Us:
Download App:
  • android
  • ios