ఐపిఎల్ సీజన్ 12లో అత్యంత వివాదాస్పదమైన విషయం మన్కడింగ్. లీగ్ దశలో భాగంగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్ మెన్ బట్లర్ ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. క్రీడా స్పూర్తికి విరుద్దంగా అశ్విన్ వ్యవహరించాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు అతడిపై మండిపడ్డారు. తాజాగా రాయల్ చాలెంజర్ బెంగళూరు బౌలర్ డెల్ స్టెయిన్ కూడా ఈ మన్కడింగ్ వివాదంపై తనదైన స్టైల్లో సెటైర్లు విసిరారు.

ఈ వివాదం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకున్నా అశ్విన్ ను అత్యుత్తమ మన్కడింగ్ బౌలర్ అంటూ స్టెయిన్ పరోక్షంగా స్పందించారు. ఇతర బౌలర్ల స్పెషాలిటీలను ప్రస్తావిస్తూ అశ్విన్ స్పెషాలిటీ మన్కడింగ్ అంటూ ఘాటైన ట్వీట్లను ట్విట్టర్లో వదిలాడు. దీంతో మరోసారి ఈ మన్కడింగ్ వివాదం తెరపైకి వచ్చింది.
ఓ క్రికెట్ అనలిస్ట్ బుమ్రా, జోప్రా ఆర్చర్, రబడ, ఇమ్రాన్ తాహిర్, అశ్విన్ ల బౌలింగ్ స్టైల్ ఎలా వుంటుందో చెప్పండంటూ ఓ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పై స్పందించిన స్టెయిన్ ''బుమ్రా బౌల్డ్, రబడ క్యాచ్ ఔట్లు, తాహిర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ చేయడంలో స్పెషలిస్టులు. అయితే అశ్విన్ మాత్రం మన్కడింగ్ స్పెషలిస్ట్'' అంటూ కామెంట్ చేశాడు.
ఇప్పటికే ఈ మన్కడింగ్ వ్యవహారం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలపాలయ్యాడు. అంతే కాకుండా ఇతర ఆటగాళ్లు (డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్) వంటి వాళ్లు మైదానంలోనే అశ్విన్‌కు మన్కడింగ్‌ను గుర్తు చేస్తూ ఆటపట్టించారు. ఇక తాజాగా స్టెయిన్ ట్వీట్ ద్వారా మరోసారి అశ్విన్ మన్కడింగ్ వార్తల్లో నిలిచింది.