కప్పు గెలవకపోయినా ఆర్‌సీబీ హడావుడి మామూలుగా ఉండదు. లక్ కలిసి వస్తుందనే ఆశతో ఇప్పటికే అనేకసార్లు జెర్సీని, థీమ్ సాంగ్‌ను మారుస్తూనే ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. గత ఏడాది ‘ఈ సాల్ కప్ నమ్‌దే’ అంటూ విడుదల చేసిన థీమ్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సాంగ్ సూపర్ హిట్టైనా కప్పు మాత్రం రాలేదు. దీంతో ఈ సారి సీజన్ ప్రారంభానికి ముందు మరో థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది ఆర్‌సీబీ.

కన్నడ, ఇంగ్లీషు కలగలిపి చేసిన ఈ రాప్ సాంగ్... కన్నడియులకు బాగా నచ్చుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి ఇది అర్థం అవుతుందా? అంటే అనుమానమే. ‘ఎన్నె బరలి... ఎంత ఇరలి’ (ఏది వచ్చినా... ఏమైనా మా మద్ధతు ఆర్‌సీబీకే) అనే అర్థంతో రూపొందించిన ఆర్‌సీబీ కొత్త థీమ్ సాంగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్‌ ఆలపిస్తూ కనిపించారు. 

దక్షిణాఫ్రికా క్రికెటర్ అయిన డివిల్లియర్స్, ఆర్‌సీబీ మీద అభిమానంతో ఈ పాట కోసం కన్నడ కూడా నేర్చుకున్నట్టుగా తెలుస్తోంది. భారత యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ ఈ సాంగ్‌లో తన రాప్ వినిపించాడు. ఆర్‌సీబీ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.