న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండవ టెస్టులో భారత్ కష్టాల సుడిగుండంలో చిక్కుకొని ఉంది. ఈ మ్యాచులో  భారత బ్యాట్స్ మెన్ స్వల్ప స్కొర్ల్సకే పెవిలియన్ చేరుకున్నారు. ఇక ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన న్యూజిలాండ్ ను కూడా భారత బౌలర్లు బాగానే కట్టడి చేసారు. 

ఇక ఇండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రపంచంలోనే ప్రస్తుతకాలంలో అత్యుత్తమ మేటి ఫీల్డర్ అయినా రవీంద్ర జడేజా... ఒక నమ్మశక్యం కానీ క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. 

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో నెయిల్ వాగ్నర్ ను అవుట్ చేసేందుకు రవీంద్ర జడేజా అందుకున్న క్యాచ్ ప్రస్థుతానికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రవీంద్ర జడేజా క్యాచ్ పట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి విపరీతమైన చర్చ ఆ క్యాచ్ పై నడుస్తుంది. 

మొహమ్మద్ షమీ బౌలింగ్ లో నెయిల్ వాగ్నర్ స్క్వేర్ లెగ్ దిశగా పుల్ షాట్ ఆడాడు. అక్కడ స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జడేజా వెనక్కి పరిగెత్తుతూ ఎగిరి ఒంటి చేత్తో ఆ బంతిని అందుకున్నాడు. పూర్తి ఏకాగ్రతతో బాల్ మీద నుంచి దృష్టి మరలకుండా టైమింగ్ తో జడేజా ఈ అద్భుత క్యాచ్ ను అందుకున్నాడు. 

జడేజా ఈ క్యాచ్ ను అందుకోగానే సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఈ వీడియోను పోస్ట్ చేసి రవీంద్ర జడేజా ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రపంచ క్రికెట్లోనే మేటి ఫీల్డర్ అని ఒక్కరు అంటుంటే... బెన్ స్టోక్స్ ప్రపంచ కప్ సందర్భంగా పట్టిన ఒక క్యాచ్ గుర్తొస్తుందని మరి కొందరు అంటున్నారు.