గాయంతో కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. అతను ఈ సంవత్సరం ప్రారంభంలో.. టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి అతడు ఉత్తమైన ప్రదర్శనలిస్తూ.. మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అతని భార్య మాట్లాడుతూ.. ఆటపై తనకు చాలా అంకిత భావం ఉందని, చివరకు తనకంటే క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

మోకాలి గాయం కారణంగా ఐదు నెలలకు పైగా ఆటకు దూరమైన భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా.. తీవ్రంగా శ్రమించి.. టీమిండియాలో తిరిగి స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈక్రమంలోనే జడేజా రీఎంట్రీపై తన భార్య రివాబా సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భార్తకు తనకంటే క్రికెట్ కే తొలి ప్రాధ్యానత ఇస్తాడని, అతని జీవితంలో క్రికెట్ తరువాతే తాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రవీంద్ర జడేజా రీఎంట్రీపై అతని భార్య ఆనందం వ్యక్తం చేసింది. అతని(జడేజా) సానుకూల వైఖరిని ప్రశంసించింది, ఇది బ్యాగీ గ్రీన్స్‌పై విజయం సాధించడంలో పెద్ద పాత్ర పోషించిందని ఆమె నమ్ముతుంది. తన కంటే.. క్రికెట్‌కే అతనికి ముఖ్యమని, ఆయనకు ఆటతో ఎంతో అనుబంధం ఉందని చెప్పింది. ఆయన ఆటపై చాలా నిబద్దతలో ఉంటాడు. అదే తన బలం. దేశం తరపున ఆడడానికే తొలి ప్రాధాన్యమిస్తాడని తెలిపింది. 

అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం చేసుకున్నాడని, బీసీసీఐ కోచ్‌లు,ఫిజియోథెరపిస్ట్‌లు అతనికి అక్కడ చాలా సహాయపడ్డారని ఆమె పేర్కొంది. అతను(జడేజా) ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడడనీ, ఆయన తన ఆటలోనే బదులిస్తారని అన్నారు. ఆయన చాలా సానుకూల వ్యాఖ్యలను, ప్రతికూల, విమర్శకులను ఎదుర్కోన్నాడని అన్నారు. కానీ వారి గురించి మాట్లాడటానికి బదులుగా.. అతను తన బలహీనతలను అధిగమిస్తూ.. ముందుకు సాగుతున్నారని ప్రశంసించింది. 

ఇక రీఎంట్రీ తరువాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్న జడేజా తొలి రెండు టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అటు బంతి, ఇటు బ్యాట్‌తో రాణించి రెండు మ్యాచ్‌ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు కంగు తిన్నారు. తద్వారా సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. కాగా భారత్, ఆసీస్‌ జట్ల మధ్య జరుగనున్న మూడో టెస్టు మార్చి1 న ఇండోర్ వేదికగా జరగనుంది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కు చేరుకోవాలంటే ఈ టెస్టులోనూ టీమిండియా గెలవాల్సి ఉంది. ఈక్రమంలో జడేజా ఇదే జోరును కొనసాగించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.