69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో టీమిండియా... భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెడుతున్న క్రిస్ వోక్స్... 

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా, 69 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా... 34 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండయా, పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు రోహిత్ శర్మ 11 పరుగులు చేసి క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు.

అదే స్కోరు వద్ద 17 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ కూడా అవుట్ కాగా... పూజారా 4 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు...39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో నాలుగో వికెట్‌కి 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు జడేజా, కోహ్లీ...

మరోవైపు 22 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను జో రూట్ అందుకోలేకపోయాడు... ఈ మ్యాచ్‌లో బౌండరీతో ఖాతా తెరిచిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ కెరీర్‌లో అత్యంత వేగంగా 23 వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.